న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు, వన్డే మ్యాచ్‌ల అరంగేట్రంలో సెంచరీలు.. తొలి క్రికెటర్‌గా ఆబిద్‌ అలీ రికార్డు!!

Pakistan vs Sri Lanka 1st Test: Pakistan opener Abid Ali 1st man to hit hundreds on Test and ODI debuts

రావల్పిండి: పదేండ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన తొలి టెస్టు 'డ్రా'గా ముగిసింది. పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. మొదటి మూడు రోజులు ఆటకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించగా.. నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దయింది. అయితే ఐదవ రోజు పూర్తి ఓవర్లు సాధ్యమయ్యాయి.

<strong>9 వికెట్లతో స్టార్క్‌ విజృంభణ.. కివీస్‌పై ఆసీస్‌ భారీ విజయం!!</strong>9 వికెట్లతో స్టార్క్‌ విజృంభణ.. కివీస్‌పై ఆసీస్‌ భారీ విజయం!!

డి సిల్వా శతకం:

డి సిల్వా శతకం:

ఐదవ రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 282/6తో చివరి రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక 6 వికెట్లకు 308 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ధనంజయ డి సిల్వా (102 నాటౌట్‌; 15 ఫోర్లు) అజేయ సెంచరీ చేశాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50) హాఫ్ సెంచరీ చేయగా.. ఓషాడా ఫెర్నాండో (40) రాణించాడు. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా తలో రెండు వికెట్లు తీశారు.

 ఆబిద్‌ అలీ సెంచరీ:

ఆబిద్‌ అలీ సెంచరీ:

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 2 వికెట్లకు 252 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు ఆబిద్‌ అలీ (109 నాటౌట్‌; 11 ఫోర్లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ (102 నాటౌట్‌; 14 ఫోర్లు) అజేయ సెంచరీలతో అలరించారు. ఫలితంగా వర్షప్రభావిత మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

తొలి క్రికెటర్‌గా రికార్డు:

తొలి క్రికెటర్‌గా రికార్డు:

సెంచరీ చేసిన ఆబిద్‌ అలీ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల క్రికెట్‌లో టెస్టు, వన్డే అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. 32 ఏళ్ల లేటు వయసులో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన అబిద్‌.. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాపై ఆడిన తొలి వన్డేలోనూ సెంచరీ (112) చేసాడు. తొలి వన్డేలోనే సెంచరీ బాదిన 15వ బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు.

మహిళల క్రికెట్‌లో బేక్‌వెల్‌:

మహిళల క్రికెట్‌లో బేక్‌వెల్‌:

మహిళల క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన ఎనిడ్‌ బేక్‌వెల్‌ టెస్టు, వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసింది. బేక్‌వెల్‌ తొలి టెస్టు (1968లో ఆ్రస్టేలియాపై 113)లో, తొలి వన్డేలో (1973లో ఇంటర్నేషనల్‌ ఎలెవన్‌పై 101 నాటౌట్‌) సెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కింది.

Story first published: Monday, December 16, 2019, 9:17 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X