న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAk vs SL: కెప్టెన్‌గా అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత సర్ఫరాజే!!

Pakistan Skipper Sarfaraz Ahmed Joins MS Dhoni In The Record Of Captaincy

కరాచి: పాకిస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనత అందుకున్నాడు. కరాచీ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌‌ సర్ఫరాజ్‌కు కెప్టెన్‌గా 50వ వన్డే మ్యాచ్. 50 వన్డేలకి కెప్టెన్సీ వహించిన సర్ఫరాజ్.. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 50 వన్డేలకి కెప్టెన్సీ వహించిన రెండో వికెట్ కీపర్‌గా రెకార్డులోకి ఎక్కాడు. ఎంఎస్ ధోనీ 2007 నుండి 2018 వరకు 200 వన్డేల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు.

<strong>IND vs SA: ఓపెనింగే నాకు సరిపోతుంది.. ప్యాడ్లు కట్టుకొని నేరుగా వెళ్లి ఆడొచ్చు: రోహిత్</strong>IND vs SA: ఓపెనింగే నాకు సరిపోతుంది.. ప్యాడ్లు కట్టుకొని నేరుగా వెళ్లి ఆడొచ్చు: రోహిత్

50 వన్డేలు.. 28 విజయాలు

50 వన్డేలు.. 28 విజయాలు

200 వన్డేలకి కెప్టెన్సీ వహించిన ధోనీ.. భారత జట్టుకు 110 విజయాలు అందించాడు. ఇక 74 పరాజయాలు ఉండగా.. 16 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 50 వన్డేలకి నాయకత్వం వహించిన సర్ఫరాజ్.. తన జట్టుకు 28 మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడు. 20 మ్యాచ్‌ల్లో పాక్ ఓడిపోగా.. రెండింటిలో ఫలితం తేలలేదు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దీంతో సర్ఫరాజ్ అహ్మద్‌ కెప్టెన్సీపై వేటు తప్పదనుకున్నా.. అతనిపై నమ్మకం ఉంచి శ్రీలంకతో సిరీస్‌కి ఎంపిక చేసింది.

సిరీస్‌ కైవసం

సిరీస్‌ కైవసం

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్‌ 2-0తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 298 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఫకర్‌ జమాన్‌ (76), అబిద్‌ అలీ (74) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ గుణతిలక (133) రాణించాడు.

ధోనీని కాపీ కొట్టిన సర్ఫరాజ్‌

ధోనీని కాపీ కొట్టిన సర్ఫరాజ్‌

సోమవారం జరిగిన రెండో వన్డేలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ శ్రీలంక బ్యాట్స్‌మన్‌కు సహాయం చేశాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఐసీసీ ట్వీట్‌ చేస్తూ 'స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌' హ్యాష్‌టాగ్‌తో పంచుకుంది. ఇది చూసిన కొందరు అభిమానులు పాక్‌ కెప్టెన్‌ ధోనీని కాపీ కొట్టాడని కామెంట్లు పెట్టారు. లక్ష్య ఛేదనలో 34వ ఓవర్‌లో లంక ఆటగాడు జయసూర్య వెన్నునొప్పితో కిందపడగా.. వెంటనే స్పందించిన సర్ఫరాజ్‌ అతడి వద్దకు వెళ్లి బ్యాట్స్‌మన్‌ కాళ్లను వెనక్కి వంచి సహాయం చేశాడు. 2015లో ధోనీ కూడా ఇలాగే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌కు సహాయం చేశాడు. దీంతో ఐసీసీ చేసిన ట్వీట్‌కు సర్ఫరాజ్‌.. ధోనీని కాపీ కొట్టాడంటూ రీట్వీట్లు చేశారు.

Story first published: Thursday, October 3, 2019, 10:59 [IST]
Other articles published on Oct 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X