న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తొలగించండి.. నన్ను కొనసాగించండి!!

Pakistans performance: pakistan Captain Sarfaraz Ahmed, Inzamam-ul-Haq, Mickey Arthur meet PCB officials

లాహోర్: ప్రస్తుతం పాకిస్తాన్‌ కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను మూడు ఫార్మాట్ల నుంచి తొలగించండి. కోచ్‌గా నన్ను కొనసాగించండి అని పాక్ హెడ్ కోచ్‌ మికీ ఆర్థర్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాడు. ప్రపంచకప్‌-2019లో పేలవ ప్రదర్శనతో పాక్ లీగ్ దశ నుండే నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ జట్టును గాడిలో పెట్టేందుకు పీసీబీ పూనుకుంది.

యువీని బాధిస్తున్న వెన్నునొప్పి.. రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కుయువీని బాధిస్తున్న వెన్నునొప్పి.. రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు

జట్టు ప్రదర్శనపై వివరణ:

జట్టు ప్రదర్శనపై వివరణ:

పాక్‌ క్రికెట్‌ను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్న నేపథ్యంలో పీసీబీ కఠినంగా వ్యహరిస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్, చీఫ్ సెలెక్టర్ ఇంజామామ్-ఉల్-హక్ మరియు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు హాజరయ్యారు. గత నాలుగు సంవత్సరాలలో జట్టు ప్రదర్శనపై వివరణ ఇచ్చారు. అంతేకాదు తమ అభిప్రాయాలను కూడా బోర్డుకు తెలిపారు.

ప్రశ్నల వర్షం:

ప్రశ్నల వర్షం:

పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశం నాలుగు గంటల పాటు కొనసాగింది. పీసీబీ క్రికెట్ కమిటీ ముందు హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మరియు కెప్టెన్ హాజరుకావడం ఇదే మొదటిసారి. మొదటగా సర్ఫరాజ్ అధికారుల ముందు హాజరవగా.. ఇంజామామ్, ఆర్థర్ తరువాత హాజరయి తన అభిప్రాయాలను తెలియజేసారు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌తో సహా పాక్ ఆటతీరుపై అధికారులు వివిధ ప్రశ్నలు అడినట్టు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ నియామకం గురించి కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిసింది.

సర్ఫరాజ్‌ను తొలగించండి:

సర్ఫరాజ్‌ను తొలగించండి:

హెడ్ కోచ్‌ మికీ ఆర్థర్‌ బోర్డుకు ఓ నివేదిక సమర్పించాడు. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను మూడు ఫార్మాట్ల నుంచి తొలగించండి అని అందులో పేర్కొన్నాడని సమాచారం తెలుస్తోంది. తన పర్యవేక్షణలో పాక్‌ మంచి ప్రదర్శన చేసింది. మరో రెండేళ్లు తన పదవిని పొడిగించాలని ఆర్థర్‌ కోరాడట. అయితే కొంతమంది కమిటీ సభ్యులు ఆర్థర్‌ ఒప్పందాన్ని 2020 టీ20 ప్రపంచకప్ వరకు పొడిగించాలని సిఫారసు చేశారట. డైరెక్టర్‌ వసీం ఖాన్‌ కూడా ఆర్థర్‌ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాడని సమాచారం.

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ.. స్మిత్ అరుదైన రికార్డు

కొనసాగిస్తారో లేదో:

కొనసాగిస్తారో లేదో:

2016లో పాకిస్తాన్‌ కోచ్‌గా ఆర్థర్‌ పదవీ భాద్యతలు స్వీకరించాడు. ఆర్థర్‌ పర్యవేక్షణలో పాకిస్తాన్‌ చాంపియన్‌ ట్రోఫీ గెలుచుకుంది. టీ20ల్లో పాక్‌ను నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపాడు. అయితే టెస్టు, వన్డే ఫార్మాట్‌లో మాత్రం పాక్‌ క్రికెట్‌ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. దీంతో పీసీబీ అధికారులు ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారో లేదో చూడాలి.

Story first published: Monday, August 5, 2019, 14:26 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X