'ఐపీఎల్‌లో ఆడకపోవడం వల్లే పాక్ నెంబర్ వన్ జట్టు అయింది'

Posted By:
Pakistan is No. 1 team in T20I rankings because they dont play in IPL: Waqar Younis

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వకార్ యూనిస్ మాట్లాడుతూ 'పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటం లేదు కాబట్టే ఆ జట్టు ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్ వన్ జట్టుగా ఎదిగింది' అని వ్యాఖ్యానించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్,ట్విటర్,గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

'మా జట్టు ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడలేదు కాబట్టే వాళ్లు చాలా ఒదిగి ఉంటారు. వాళ్లు కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రమే ఆడుతారు. ఒక పిల్లాడు క్రికెట్ ఆడతున్నాడంటే అది కోట్లలో డబ్బుల సంపాదించడానికి కాదు.. తాను క్రికెట్ ఇష్టంతో ఆడుతున్నట్లు' అని వకార్ యూనిస్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిందని అన్నాడు.

'ఇప్పుడు ప్రతీ క్రికెటర్ ఐపీఎల్‌పై దృష్టి పెడుతన్నారు. ఎందుకంటే అక్కడ డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు. ఐపీఎల్‌లో ఒక క్రికెటర్‌కి దాదాపు 2 మిలియన్ డాలర్లు వస్తాయి.. కానీ అదే క్రికెటర్‌కి పాకిస్థాన్‌లో కేవలం 25వేల డాలర్లు మాత్రమే వస్తాయి' అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు.

నిజానికి కొన్ని లీగ్‌ల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నాడు. 'ఇప్పుడు క్రికెట్‌లో చాలా డబ్బు ఉంది. కానీ కొత్తగా పుట్టు కొచ్చిన కొన్ని లీగ్‌ల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి క్రికెట్ బోర్డులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు.

ఐపీఎల్‌లో ఆడాలని లేదు, పిలిచి అడిగినా ఆడను: షాహిద్ అఫ్రీది

'పిలిచి ఆడమని అడిగినా ఐపీఎల్‌లో ఆడను' అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత వకార్ యూనిస్ కూడా ఐపీఎల్‌పై ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఐపీఎల్ 11వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై-ముంబై మధ్య జరుగనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 18:43 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి