న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ ఆటగాళ్లకు పీసీబీ వార్నింగ్: ఫిట్‌గా లేకుంటే ఫీజులో 15 శాతం కోత!

Pakistan Cricket Board warns players they risk deduction in salary and demotion if they fail to meet minimum fitness requirements

హైదరాబాద్: తమ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సరికొత్త చర్యలకు దిగింది. కనీస స్థాయి ఫిట్‌నెస్‌ లేని ఆటగాళ్లకు నెలవారీ జీతంలో 15 శాతం జరిమానా విధిస్తామంటూ పీసీబీ ప్రకటించింది. ఆ మేరకు బోర్డు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించిన కనీస ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అందుకోవడంలో ఆటగాళ్లు విఫలమైతే వాళ్ల నెల జీతం నుంచి 15 శాతం జరిమానాగా చెల్లించాలి. ఆ ప్రమాణాలను చేరుకునేంత వరకూ ఈ కోత కొనసాగుతూనే ఉంటుంది. ఫిట్‌నెస్‌ పరీక్షల్లో వరుస వైఫల్యం ఆటగాళ్ల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కేటగిరీపై ప్రభావం చూపొచ్చు" అని హెచ్చరించింది.

నా తొలి వికెట్‌ స్టీవ్‌ స్మిత్‌: ఆసీస్‌ను ఎలా ఔట్ చేస్తారనే ప్రశ్నకు బుమ్రా క్లాసిక్ రెస్పాన్స్!నా తొలి వికెట్‌ స్టీవ్‌ స్మిత్‌: ఆసీస్‌ను ఎలా ఔట్ చేస్తారనే ప్రశ్నకు బుమ్రా క్లాసిక్ రెస్పాన్స్!

నేషనల్ క్రికెట్‌ అకాడమీ ఆధ్వర్యంలో

నేషనల్ క్రికెట్‌ అకాడమీ ఆధ్వర్యంలో

నాలుగో విడత ఫిట్‌నెస్‌ పరీక్షలను నేషనల్ క్రికెట్‌ అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ట్రైనర్‌ యాసిర్‌ మాలిక్‌ నేతృత్వంలో సాగే ఈ పరీక్షలో ఐదు విభాగాలు ఉంటాయని వివరించింది. జాతీయ జట్టులో ఆడే ఆటగాళ్లతో పాటు దేశవాళీ క్రికెటర్లకూ ఈ పరీక్షలు నిర్వహించేందుకు పీసీబీ సిద్ధమవుతోంది.

పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు

పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు

నిజానికి పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఎప్పటినుంచో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ నాకౌట్‌ స్టేజిని కూడా దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు తమ ఆహారంలో మార్పులు చేసుకోవాలని ప్రధాన కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ సూచించిన సంగతి తెలిసిందే.

పాక్ ఆటగాళ్లకు బిర్యానీలు బంద్

పాక్ ఆటగాళ్లకు బిర్యానీలు బంద్

ఆటగాళ్లకు బిర్యానీలు, అధిక నూనెతో చేసిన మాంసాహారం, స్వీట్లు ఇవ్వబోమని కూడా మిస్బా పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గోనే పాక్‌ ఆటగాళ్లు వహాబ్‌ రియాజ్‌, మొహమ్మద్‌ అమీర్‌, షాదాబ్‌ ఖాన్‌లకు జనవరి 20, 21లలో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

Story first published: Saturday, January 4, 2020, 9:58 [IST]
Other articles published on Jan 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X