న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG:ఇంగ్లండ్ చేతిలో చిత్తు.. కెప్టెన్‌గా బాబర్ ఆజామ్ చెత్త రికార్డు!

PAK vs ENG: Babar Azam becomes the first Pakistan captain to lose 4 Test matches at home in a year

కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చెత్త రికార్డు నమోదు చేశాడు. పాకిస్థాన్ సారథిగా సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన తొలి కెప్టెన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన మూడో టెస్ట్‌లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దాంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను పాక్ 0-3 కోల్పోయింది. మరోవైపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. పాకిస్థాన్ గడ్డపై ఆ జట్టును వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి.

వరుసగా నాలుగు ఓటములు..

వరుసగా నాలుగు ఓటములు..

తాజా ఓటమితో పాకిస్థాన్ సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక ఏడాది కాలంలో సొంతగడ్డపై ఇలా నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా పాక్ ఓడటం ఇదే తొలిసారి. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్థాన్.. పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పాకిస్థాన్ సొంతగడ్డపై వరుసగా నాలుగు సిరీస్‌లు ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిన పాక్.. టీ20 సిరీస్‌లోనూ ఓటమిపాలైంది. టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఓడిన బాబర్ సేన.. తాజాగా టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది.

టీ20 తరహా బ్యాటింగ్‌తో..

టీ20 తరహా బ్యాటింగ్‌తో..

167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35 నాటౌట్), జాక్ క్రాలీ(41) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. 112/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 11.1 ఓవర్లలోనే మిగిలిన 55 పరుగులు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. టీ20 తరహాలో సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను హరీ బ్రూక్ అందుకున్నాడు.

 రఫ్ఫాడించిన రెహాన్ అహ్మద్..

రఫ్ఫాడించిన రెహాన్ అహ్మద్..

ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ పాక్ పతనాన్ని శాసించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల‌తో బాబర్ సేన పనిపట్టాడు. రెహాన్ అహ్మద్ ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే 5 వికెట్ల ఘనతను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా రెహాన్ రికార్డుకెక్కాడు. 18 ఏళ్ల 126 రోజుల వయసుతో ఈ ఫీట్ సాధించిన రెహాన్.. ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ రికార్డును అధిగమించాడు.

 సంక్షిప్త స్కోర్లు

సంక్షిప్త స్కోర్లు

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 304 ఆలౌట్

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 354 ఆలౌట్

పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 216 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 170/2

Story first published: Tuesday, December 20, 2022, 13:12 [IST]
Other articles published on Dec 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X