న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఓపెనర్‌గానే బాగుంది, ఇదే నా బలం కూడా': సాహా

Opening innings is big plus for me: Wriddhiman Saha

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా సన్ రైజర్స్ తరపున ఓపెర్‌గా బరిలోకి దిగుతున్న వృద్ధిమాన్ సాహా ఇలా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగడాన్ని ఆస్వాదిస్తున్నానని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా తెలిపాడు. ముంబై, కోల్‌కతాపై హైదరాబాద్‌ విజయం సాధించడంలో సాహా (22, 24 రన్స్‌) కీలక పాత్ర పోషించాడు.

మొహాలీ వేదికగా ఏప్రిల్ 19, గురువారం.. కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా దిగి భారీ ఇన్నింగ్స్‌ సాధించాలని సాహా పథకం సిద్ధం చేసుకున్నాడు. 'నేను సహజ క్రికెట్‌ ఆడడానికే ఇష్టపడతా. కోచ్‌ టామ్‌ మూడీ, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడంతో సద్వినియోగం చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తున్నా. పవర్‌ప్లేలో ధాటిగా ఆడడానికి ప్రయత్నిస్తున్నా. ఎలాంటి ఒత్తిడీ లేకుండా స్వేచ్ఛగా ఆడమని కోచ్‌, కెప్టెన్‌ చెబుతున్నారు' అని సాహా అన్నాడు.

ఈ సందర్భంగా ఆయన కొనసాగిస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్‌గా కొనసాగడం అనేది మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. అలాగే ప్రస్తుతం సన్‌రైజర్స్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉందని తెలియజేశాడు. భువనేశ్వర్‌, రషీద్‌ ఖాన్‌, షకీబల్‌, సిద్దార్ధ్‌ కౌల్‌, బిల్లీ స్టాన్‌లేక్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని పేర్కొన్నాడు.

అద్భుతమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ జట్టు ప్రత్యర్థిని 150 స్కోరులోపే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోందని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ అనేది క్రికెటర్లకు కెరీర్‌లో ఎదగడానికి గొప్ప వేదికని, యువ ఆటగాళ్లకు సీనియర్లతో కలిసి ఆడే అవకాశం లభిస్తుందని తెలిపాడు. కాబట్టి ఈ ఛాన్స్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సాహా అన్నాడు.

Story first published: Thursday, April 19, 2018, 16:59 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X