న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#OnThisDay in 2004: టెస్టు క్రికెట్‌లో 400 పరుగులు చేసిన లారా

By Nageshwara Rao
#OnThisDay in 2004, Brian Lara marathoned his way to the highest score in Test cricket

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు బ్రియాన్ లారా. 2004లో ఏప్రిల్ 12(ఇదే రోజు)న వెస్టిండిస్‌లోని జాన్స్‌ పట్టణంలో లారా టెస్టు క్రికెట్లో ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆంటిగ్వా క్రికెట్‌ స్టేడియంలో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో లారా ఈ ఘనతను సాధించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అప్పటికే మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైన పర్యాటక జట్టు ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ప్రయత్నించింది. ఈ టెస్టులో లారా పరుగుల ప్రభంజనంతో గెలుపు మాట అటుంచి డ్రా కోసం యత్నించింది.

 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

1994లో ఇంగ్లాండ్‌పై 375 పరుగులు చేసి టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లారా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ హెడెన్‌ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి లారా రికార్డుని బద్దలు కొట్టాడు.

 లారా రికార్డుని బద్దలు కొట్టిన ఆసీస్ క్రికెటర్ హెడెన్

లారా రికార్డుని బద్దలు కొట్టిన ఆసీస్ క్రికెటర్ హెడెన్

దీంతో ఏడాది తిరక్కుండానే 2004లో ఏప్రిల్‌లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లారా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ హెడెన్‌ రికార్డుని అధిగమించాడు. టెస్టు క్రికెట్‌లో తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు. అంతేకాదు పదేళ్ల తర్వాత (2004లో) అదే జట్టుపై అదే గ్రౌండ్‌లో లారా ఈ ఇన్నింగ్స్ ఆడటం విశేషం.

లారా ఇన్నింగ్స్ రోజు వారీగా ఇలా

లారా ఇన్నింగ్స్ రోజు వారీగా ఇలా

ఈ మ్యాచ్‌లో తొలి రోజు 86 పరుగులు చేసిన లారా.. రెండో రోజు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిపుల్‌ సెంచరీ (313 పరుగులు) సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. ఇక, మూడో రోజు మరో 87 పరుగులు జోడించి 400 పరుగుల మార్కుని అందుకుని నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వెస్టిండిస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 751 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. వెంటనే లారా తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్డ్‌ చేశాడు.

 13 గంటల పాటు క్రీజులో పాతుకుపోయిన లారా

13 గంటల పాటు క్రీజులో పాతుకుపోయిన లారా

202 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోయిన లారా 582 బంతులెదుర్కొని 43 ఫోర్లు, నాలుగు సిక్స్‌ర్లతో 400 పరుగుల సెంచరీ సాధించాడు. 13 గంటల పాటు క్రీజులో ఉన్నాడు. లారా ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌కు ఫాలో ఆన్‌ తప్పలేదు. ఈ టెస్టులో తగినంత సమయం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అత్యధిక పరుగుల రికార్డు 501 నాటౌట్‌ లారా పేరిటే ఉండటం విశేషం.

Story first published: Thursday, April 12, 2018, 14:47 [IST]
Other articles published on Apr 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X