న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ చరిత్రలో ఇదే రోజు..సువర్ణాక్షరాలతో సన్‌రైజర్స్ పేరు: ఇప్పటికీ చెదరని రికార్డు

On this day in 2016, David Warner led Sunrisers Hyderabad beat RCB and won the IPL title

అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌ ఫైనల్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా దీన్ని నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ ఇవ్వాళ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. క్లోజింగ్ సెరిమనీని నిర్వహిస్తోండటం వల్ల మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమౌతుంది. ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ ముగిసే సమయానికి అర్ధరాత్రి అవ్వొచ్చు.

నాలుగో స్లాట్‌లోకి వచ్చి..

నాలుగో స్లాట్‌లోకి వచ్చి..

ఐపీఎల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చెక్కు చెదరని ముద్రను వేసింది. ఐపీఎల్ 2016 సీజన్‌లో నమోదు చేసిన ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చేదరట్లేదు. దాన్ని ఇప్పట్లో ఎవరూ కొట్టేలానూ కనిపించట్లేదు. ఈ సీజన్‌తో ఆ రికార్డ్ చెరిగిపోతుందని భావించినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు. అదే- ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఆడి టైటిల్‌ను ఎగరేసుకెళ్లడం.

ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఆడటం అంటే.. చిట్టచివరి దశలో ప్లేఆఫ్స్‌లో అవకాశం దక్కించుకున్నట్టు. ఆ స్థాయి నుంచి టైటిల్ ఛాంపియన్‌గా ఎదగడం అనేది ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే సాధ్యమైంది.

2016 సీజన్‌లో సరిగ్గా ఇదే రోజు..

2016 సీజన్‌లో సరిగ్గా ఇదే రోజు..

2016లో సరిగ్గా ఇదే రోజు ఆ ఘనతను సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. నాలుగో స్లాట్‌ను బుక్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ఎలిమినేటర్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడింది. ఆ జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 162 పరుగులే చేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోగలిగింది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను 140 పరుగులకే పరిమితం చేసింది.

రెండో క్వాలిఫయర్‌లో అప్పటి గుజరాత్ లయన్స్‌‌తో ఓ ఆట ఆడుకుంది. గుజరాత్ లయన్స్ 163 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది సన్‌రైజర్స్. దర్జాగా ఫైనల్స్‌లో అడుగు పెట్టింది.

ఫైనల్స్‌లో ఆర్సీబీపై

ఫైనల్స్‌లో ఆర్సీబీపై

ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది. ఫైనల్స్‌లో ఏకంగా 208 పరుగులు చేసింది. కేప్టెన్ కమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 69 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్-28, యువరాజ్ సింగ్-38, బెన్ కట్టింగ్-39 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 200 పరుగులే చేయగలిగింది.

ఓపెనర్లు క్రిస్ గేల్-76, విరాట్ కోహ్లీ-54 పరుగులతో 114 పరుగులు చేసినప్పటికీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది ఆర్సీబీ. కేఎల్ రాహుల్, షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్ని, క్రిస్ జోర్డాన్ పరుగులు చేయలేకపోయారు. బెన్ కట్టింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అందుకున్నాడు.

ఏదీ నాటి వైభవం..

ఏదీ నాటి వైభవం..

అలాంటి జట్టు ఈ సీజన్‌లో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకున్న తరువాత ఒక్కసారిగా కుప్పకూలింది సన్‌రైజర్స్. అయిదు మ్యాచ్‌లల్లో ఎలా విజయం సాధించిందో.. ఆ తరువాతి అయిదింట్లో అదే రేంజ్‌లో ఓడిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి దూకుడు కొనసాగించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో రెండో స్థానం వరకు ఎగబాకిన ఈ జట్టు.. ప్రస్తుతం 12 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. మొత్తంగా 14 మ్యాచ్‌లల్లో ఎనిమిదింట్లో ఓడింది. అవమానకరంగా వైదొలగింది.

Story first published: Sunday, May 29, 2022, 11:04 [IST]
Other articles published on May 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X