న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమెన్ వరల్డ్ టీ20కి ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసిన ఐసీసీ

Official tournament song of the 2018 icc womens world t20

హైదరాబాద్: మిథాలీ రాజ్ వంటి ప్రముఖులు తెలిపినట్లుగా మహిళా క్రికెట్‌కు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. భారత్‌లోనూ మునుపటి కంటే మెరుగ్గా ఫలితాలు సాధించే క్రికెటర్లు వస్తుండటంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ముందుకు దూసుకుపోతోంది భారత్. వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20కి భారత్ ఇప్పటికే అక్కడికి చేరుకుంది. భారత మహిళా క్రికెటర్లు ప్రపంచ కప్ సాధించాలనే నమ్మకంతో టోర్నమెంట్‌కు సిద్ధమైయ్యారు.

మహిళల ప్రపంచకప్‌పై అంచనాలను

2018 ఉమెన్స్ టీ 20 ప్రపంచకప్ స్పెషల్ ప్రోమో సాంగ్ ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 6వ మహిళల టీ20 టోర్నీకి వెస్టిండీస్ దీవులు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ ప్రమోషన్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారికంగా సాంగ్ విడుదల చేసింది. క్రికెట్ అభిమానులతో పాటు సంగీత అభిమానులను సైతం ఉర్రూతలూగిస్తోంది ఈ ప్రమోషనల్ సాంగ్. దాంతో పాటుగా మహిళల ప్రపంచకప్‌పై అంచనాలను మరింత పెంచేసింది.

'వాచ్ దిస్' పేరుతో రిలీజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌‌

'వాచ్ దిస్' పేరుతో రిలీజ్ చేసిన ఈ ప్రమోషనల్ సాంగ్‌‌కు క్రికెట్ ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ట్రినిడాడ్‌కు చెందిన పాప్ స్టార్ పాట్రిస్ రాబర్ట్స్, జమైకన్ సింగర్ షెన్సియా కలిసి 'వాచ్ దిస్' సాంగ్ పాడారు. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈ ఏడాది నవంబరు 9 నుంచి 24 వరకు వెస్టిండీస్‌లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

మిగిలిన వాటితో కలిపి గ్రూప్-బిలో భారత్

మిగిలిన వాటితో కలిపి గ్రూప్-బిలో భారత్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్‌లతో కలిపి భారత్ గ్రూప్-బిలో ఉంది. భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహారించనుంది. వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ స్మృతి మందానను సెలక్టర్లు ఎంపిక చేశారు. నవంబరు 9న భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. 11న పాకిస్థాన్, 15న ఐర్లాండ్, 17న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ గయానా వేదికగా జరగనున్నాయి.

ఐసీసీ వరల్డ్ టీ20లో ఆడే భారత మహిళల జట్టు:

ఐసీసీ వరల్డ్ టీ20లో ఆడే భారత మహిళల జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తాన్యా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజ పాటిల్, ఏక్తా బిష్త్, డి.హేమలత, మాన్షి జోషి, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి

Story first published: Saturday, November 10, 2018, 13:04 [IST]
Other articles published on Nov 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X