న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ సారి మంచిగా రాస్తారని ఆశిస్తున్నా: డబుల్ సెంచరీ తర్వాత రోహిత్ శర్మ విజ్ఞప్తి

IND vs SA,3rd Test : Rohit Sharma's Plea To Media After Ranchi Epic || Oneindia Telugu
Now youll write some good things I hope: Rohit Sharmas plea to media after Ranchi epic

హైదరాబాద్: "ఇకనైనా మీడియా నా గురించి మంచిగా రాస్తుందని ఆశిస్తున్నా" అని రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ అనంతరం ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలివి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో టీమిండియా ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్ శర్మ రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ "వచ్చిన అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే నా టెస్టు కెరీర్‌ గురించి మీరు వార్తలు రాస్తారు. గతంలో ఎన్నో రాశారు. కానీ, ఈ సారి మంచిగా రాస్తారని ఆశిస్తున్నా. కొత్త బంతితో ఆడటం వేరే అనుభూతి. పుణె, రాంచీ మైదానాల్లో ఉదయం బ్యాటింగ్‌ చేయడం కష్టం" అని పేర్కొన్నాడు.

<strong>ఐఎస్ఎల్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా చిరంజీవి: టైగర్, దిశా డ్యాన్స్ అదుర్స్, కేరళ విజయం</strong>ఐఎస్ఎల్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా చిరంజీవి: టైగర్, దిశా డ్యాన్స్ అదుర్స్, కేరళ విజయం

రబాడ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడం

"రబాడ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడం సవాల్‌తో కూడుతున్నది. విదేశాల్లో పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉంటాయి. టెస్టు ఓపెనర్‌గా విదేశీ పిచ్‌లపై ఉండే సవాలు కోసం ఎదురుచూస్తున్నాను" అని రోహిత్‌ శర్మ తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మ 500కుపైగా పరుగులు చేశాడు.

ఒకే టెస్టు సిరీసులో 500కిపైగా పరుగులు

ఒకే టెస్టు సిరీసులో 500కిపైగా పరుగులు

ఇందులో రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. దీంతో ఒకే టెస్టు సిరీసులో 500+ స్కోరు సాధించిన ఐదో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు వినోద్‌ మాన్కడే, బుధి కుందరన్, సునీల్‌ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌‌లు ఈ ఘనత సాధించారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండుసార్లు 150కిపైగా పరుగులు చేసిన తొలి ఓపెనర్‌‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.

అజహరుద్దీన్ రికార్డు బద్దలు

అజహరుద్దీన్ రికార్డు బద్దలు

ఇదే జట్టుపై 500కు పైగా పరుగులు సాధించిన భారత ఆటగాడిగా అజహరుద్దీన్‌ (1996/97లో 388 పరుగులు) రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. మరోవైపు వన్డేల్లో మూడుసార్లు డబుల్‌ సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ ఇప్పుడు టెస్టుల్లో సైతం డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ సిరిస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ముగ్గురు డబుల్ సెంచరీలు చేయడం

ముగ్గురు డబుల్ సెంచరీలు చేయడం

ఒకే సిరిస్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు డబుల్‌ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తొలి టెస్టులో మయాంక్‌, రెండో టెస్టులో విరాట్‌, తాజాగా రోహిత్‌ ఈ ఫీట్‌ సాధించారు. రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ఇంకా 488 పరుగుల వెనుకంజలో ఉంది. కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌ను 497/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 21, 2019, 9:47 [IST]
Other articles published on Oct 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X