న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sri Lanka crisis: పెట్రోల్ లేకున్నా..స్మృతి మంధానను చూడ్డానికొచ్చాడు

No Petrol, but still came to see Smriti Mandhana: Sri Lanka fan show a placard

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి తెర పడట్లేదు. ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. లీటర్ పెట్రోల్ అక్షరాలా 420 రూపాయలు పలుకుతోంది. అయినా దొరకట్లేదు. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి నిల్చుంటున్నారు. రేషనలైజేషన్ పద్ధతిన శ్రీలంకలో ఇంధనం అమ్మకాలు కొనసాగుతున్నాయి. పెట్రోల్‌ను కొనుగోలు చేయడానికి భారత్ ఇప్పటికే వేలాది డాలర్ల ఆర్థిక సహాయాన్ని చేసింది.

ఈ పరిస్థితుల్లో కూడా శ్రీలంకలో క్రికెట్‌కు ఆదరణ తగ్గట్లేదు. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లకు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. టీ20, వన్డే ఇంటర్నేషల్ సిరీస్‌ను ఆస్వాదించారు. టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా.. వన్డేలను శ్రీలంక గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇటు భారత మహిళా క్రికెట్ జట్టు కూడా శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ మూడు చొప్పున సిరీస్‌ల్లో ఆడుతోంది. మొదటి టీ20ని భారత్ గెలుచుకుంది.

రెండో మ్యాచ్ కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగుల చేసింది. భారత్ ఇన్నింగ్ కొనసాగుతోంది. విజయం వైపు పయనిస్తోంది విమెన్స్ టీమిండియా. 12 ఓవర్లల్లో మూడు వికెట్ల 91 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 39 పరుగులు, షఫాలి వర్మ-17, సబ్బినేని మేఘన-17 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కేప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్-14, జెమిమా రోడ్రిగ్స్ ఒక పరుగుతో ఆడుతున్నారు.

కాగా- ఈ మ్యాచ్ సందర్భంగా శ్రీలంకకు చెందిన స్మృతి మంధాన అభిమాని ఒకరు ఆసక్తికరమైన ప్లకార్డ్‌ను ప్రదర్శించడం ఆకట్టుకుంది. శ్రీలంకలో నెలకొన్న పెట్రోల్ సంక్షోభానికి అద్దం పట్టింది అందులోని సారాంశం. పెట్రోల్ లేదు.. అయినా స్మృతి మంధానను చూడ్డానికి స్టేడియానికి వచ్చా.. అని రాసివున్న ప్లకార్డ్‌ను ఆ అభిమాని ప్రదర్శించాడు. సంక్షోభం ఎదురైనప్పటికీ శ్రీలంకలో క్రికెట్‌కు ఆదరణ తగ్గట్లేదని, టీమిండియా ప్లేయర్లపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనంగా మారింది.

Story first published: Saturday, June 25, 2022, 16:50 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X