న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షకిబుల్‌ హసన్‌పై చట్టపరమైన చర్యలు లేవు.. వివరణ మాత్రం ఇవ్వాలి: బీసీబీ

No legal action on Shakib Al Hasan but he reply to showcause notice confirms BCB CEO

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ షకిబుల్‌ హసన్‌కు భారీ ఊరట లభించింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) నిబంధనల్ని ఉల్లంఘించిన షకిబుల్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ స్పష్టం చేసాడు. అయితే సెంట్రల్‌ కాంట్రాక్ట్ నిబంధనను ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసుకు షకిబుల్‌ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సీఈఓ నిజాముద్దీన్ చౌదరి పేర్కొన్నారు.

తగ్గనున్న వాయు కాలుష్యం.. ఢిల్లీలోనే తొలి టీ20.. స్పష్టం చేసిన బీసీసీసీ!!తగ్గనున్న వాయు కాలుష్యం.. ఢిల్లీలోనే తొలి టీ20.. స్పష్టం చేసిన బీసీసీసీ!!

అక్టోబర్‌ 22న షకిబుల్‌ హసన్‌ బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించి బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ గ్రామీఫోన్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఇది బోర్డు నియమావళిని అతిక్రమించనట్లు కావడంతో షకిబుల్‌పై చర్యలు తీసుకోవాలని బీసీబీ భావించింది. అతడికి నోటీసు కూడా జారీ చేసింది. 'రోబీ మా టైటిల్‌ స్పాన్సర్‌. గ్రామీఫోన్‌ టైటిల్‌ స్పాన్సర్‌కు బిడ్‌ దాఖలు చేయకుండా కొందరు క్రికెటర్లకు ఎక్కువ మొత్తం ఇచ్చి వారితో ఒప్పందం కుదుర్చుకుంటోంది. మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్‌తో పాటు సదరు కంపెనీ నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. లీగల్‌ నోటీసు పంపాం' అని ఇంతకుముందు నజ్ముల్‌ తెలిపారు.

అయితే షోకాజ్‌ నోటీసు పంపిన కొన్ని గంటల వ్యవధిలోనే బీసీబీ మనసు మార్చుకుని షకిబుల్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదని పేర్కొంది. 'ఇది బోర్డు అంతర్గత వ్యవహారం. ఇక్కడితేనే ముగింపు పలకాలని అనుకుంటున్నాం. షకిబుల్‌పై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాడు ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు అనే దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంది' అని నజ్ముల్‌ తెలిపారు.

దేశవాళీ క్రికెటర్ల జీతాలు, ఇతర సౌకర్యాల మెరుగుదలకు షకీబల్‌ హసన్‌ సారథ్యంలోని సీనియర్‌ ఆటగాళ్లు సమ్మె చేయడం, దాంతో దిగొచ్చిన బీసీబీ వారి 11 డిమాండ్లకు సమ్మతించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీలో జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో భారత్‌-బంగ్లాదేశ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. అక్టోబర్‌ 30వ తేదీ నాటికి బంగ్లా క్రికెటర్లు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. రెండో, మూడో టీ20లను నాగ్‌పుర్‌, రాజ్‌కోట్‌లలో జరగనున్నాయి. అనంతరం ఇండోర్‌, కోల్‌కతాలో రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతుంది.

Story first published: Monday, October 28, 2019, 16:20 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X