న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచంలో ఏ బౌలర్ నన్ను భయపెట్టలేదు.. కానీ, పని ప్రకృతి చేసింది'

No bowler in the world could do to me, what was done by nature today says Viv Richards

హైదరాబాద్: ప్రపంచంలో ఏ బౌలర్ నన్ను భయపెట్టలేదు... కానీ, ఆ పని ప్రకృతి చేసిందని వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అన్నాడు. భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు వివ్ రిచర్డ్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో రిచర్డ్స్ అస్వస్థతకు గురయ్యాడు. టీవీ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొన్న అతను ఉన్నట్లుండి కుప్పకూలాడు. 67 ఏళ్ల రిచర్డ్స్‌ను వెంటనే వాలంటీర్ల సహాయంతో స్ట్రెచర్‌పై రిచర్డ్స్‌ను పడుకోబెట్టి ఆసుపత్రికి తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. తీవ్ర ఉక్కపోత ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్: యాషెస్‌ సిరిస్ మొత్తానికి అండర్సన్‌ దూరంఇంగ్లాండ్‌కు ఊహించని షాక్: యాషెస్‌ సిరిస్ మొత్తానికి అండర్సన్‌ దూరం

చికిత్స అనంతరం రిచర్డ్స్‌ రెండో సెషన్‌లో

చికిత్స అనంతరం రిచర్డ్స్‌ రెండో సెషన్‌లో

చికిత్స అనంతరం రిచర్డ్స్‌ రెండో సెషన్‌లో సహచర వ్యాఖ్యాతలతో కలిసిపోయాడు. ఈ సందర్భంగా రిచర్డ్స్ మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరికీ మనవి నేను కోలుకున్నాను. కామెంటరీకీ తిరిగి వచ్చాను. ప్రపంచంలో ఏ బౌలర్ నన్ను భయపెట్టలేదు కానీ ఆ పని ప్రకృతి చేసింది. ఏది ఏమైనా మనం ప్రకృతిని గౌరవించాల్సిందే" అని అన్నాడు.

ఆసక్తికరంగా సాగుతోన్న రెండో టెస్టు

ఇదిలా ఉంటే, జమైకాలోని కింగ్‌స్టన్ వేదికగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మయాంక్ అగర్వాల్(55), విరాట్ కోహ్లీ(76) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.

క్రీజులో విహారి(42), పంత్(27)

క్రీజులో విహారి(42), పంత్(27)

క్రీజులో హనుమ విహారి(42), రిషబ్ పంత్(27) పరుగులతో ఉన్నారు. వెస్టిండిస్ బౌలర్లలో జాసన్ హౌల్డర్‌కు మూడు, కీమర్ రోచ్, కార్న్‌వాల్ తలో వికెట్ తీసుకున్నారు. టీమిండియా ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో నెగ్గిన జట్టుతోనే బరిలోకి దిగింది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కలేదు.

తొలి మ్యాచ్‌లో ఫరవాలేదనిపించిన భారీకాయుడు

తొలి మ్యాచ్‌లో ఫరవాలేదనిపించిన భారీకాయుడు

మరోవైపు వెస్టిండిస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన వికెట్‌ కీపర్‌ షై హోప్‌ స్థానంలో జహ్‌మర్‌ హామిల్టన్‌ జట్టులోకి రాగా... ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ ఓ వికెట్‌తో పాటు 2 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆరున్నర అడుగులు, 140 కిలోల బరువున్న కార్న్‌వాల్‌ తొలి మ్యాచ్‌లోనే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు.

Story first published: Saturday, August 31, 2019, 14:19 [IST]
Other articles published on Aug 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X