న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్లాక్‌మెయిల్‌ చేస్తారా?: క్రికెట్‌ ఆస్ట్రేలియాపై బీసీసీఐ ఆగ్రహం

Women’s T20 : BCCI Says 'No Australian Players In Women's IPL' || Oneindia Telugu
No Aussie in womens IPL: BCCI says Cricket Australia blackmailing for mens series rescheduling

హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియా బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతోందంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 6 నుంచి జరగనున్న మహిళల ఐపీఎల్‌లో పాల్గొనకుండా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను ఆస్ట్రేలియా (సీఏ) అడ్డుకుంది. అంతేకాదు తమ మహిళా క్రికెటర్లను పంపించాలంటే ఎఫ్‌టీపీ (ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రాం) వివాదం తేల్చాలని మెలిక పెట్టింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

 అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఎఫ్‌టీపీ (ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రాం)లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు పర్యటించాల్సి ఉంది. అయితే, ప్రసారదారుల ఒత్తిడితో ఈ సిరీస్‌ను ఎలాగైనా వాయిదా వేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. అయితే, ఇందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో ఆసీస్ మహిళా క్రికెటర్లను ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపకుండా బీసీసీఐపై ఒత్తిడి పెంచాలనే ప్రయత్నం చేస్తోంది.

బీసీసీఐకి క్లార్క్ మెయిల్

బీసీసీఐకి క్లార్క్ మెయిల్

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిణి బెలిందా క్లార్క్ బీసీసీఐకి ఈమెయిల్ పంపారు. "ఎఫ్‌టీపీ ప్రకారం 2020లో ఆడాల్సిన సిరీస్‌కు సంబంధించిన సమస్య పరిష్కారమైతే మా మహిళా క్రికెటర్లను ఐపీఎల్‌కు పంపడంపై నిర్ణయం తీసుకోగలుగుతాం" అని మెయిల్‌లో క్లార్క్‌ పేర్కొంది.

షరతులు పెట్టడంపై బీసీసీఐ ఆగ్రహం

షరతులు పెట్టడంపై బీసీసీఐ ఆగ్రహం

మహిళా క్రికెటర్లకు అనుమతిచ్చేందుకు ఇలా షరతులు పెట్టడమేంటని సీఏపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషుల క్రికెట్‌కు మహిళా ఐపీఎల్‌కు ముడిపెట్టడం ఏమిటని నిలదీసింది. "క్లార్క్‌ ఈమెయిల్‌ చూస్తే వాళ్లు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మహిళా ప్లేయర్‌లను పంపడానికి, పురుషుల సిరీస్‌కు సంబంధమేంటి? ఎఫ్‌టీపీ ప్రకారం ఆ సిరీస్‌ జరగాల్సివుంది. సిరీస్‌పై వాళ్లిప్పుడు వెనుకంజవేస్తున్నారు" అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు.

మహిళల ఐపీఎల్‌లో ముగ్గురు క్రికెటర్లు

మహిళల ఐపీఎల్‌లో ముగ్గురు క్రికెటర్లు

కాగా, ఐపీఎల్ టోర్నీలో భాగంగా మహిళల ఐపీఎల్‌ను మే 6 నుంచి 11 వరకు జైపూర్‌ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మహిళల ఐపీఎల్‌లో ముగ్గురు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు లానింగ్, ఎలిస్ పెర్రీ, అలిసీ హీలీలు ఆడాల్సి ఉంది. ఈ ముగ్గురిని ఐపీఎల్‌ కోసం వారిని భారత్ పంపాల్సిందిగా బీసీసీఐ కోరడంతో సీఏ ఇలా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది.

Story first published: Saturday, April 27, 2019, 11:13 [IST]
Other articles published on Apr 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X