న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ అంపైర్‌ ఎలైట్ ప్యానెల్‌లో నితిన్ మీనన్‌.. మూడో భారతీయుడుగా రికార్డు!!

Nitin Menon included in ICC Elite Panel for 2020-21 season

దుబాయ్: 2020-21 సీజన్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తమ అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ ఎలైట్ ప్యానెల్‌లో భారత్‌కు చెందిన నితిన్ మీనన్‌కు చోటు దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన నిగ‌ల్ లాంగ్ స్థానంలో 36 ఏళ్ల నితిన్ మీన‌న్‌ను నిమియ‌మించారు. దీంతో ఐసీసీ ఎలైట్‌ అంపైర్ల ప్యానల్‌లో చోటుదక్కించుకొన్న మూడో భారతీయుడిగా నితిన్‌ రికార్డుల్లోకెక్కారు. అంత‌ర్జాతీయ మాజీ అంపైర్ న‌రేంద్ర మీన‌న్ కుమారుడే నితిన్ మీన‌న్‌.

ఐసీసీ ఎలైట్ అంపైర్‌గా నితిన్

ఐసీసీ ఎలైట్ అంపైర్‌గా నితిన్

ఇంతకు ముందు ఎలైట్‌ అంపైర్లుగా భారత్ నుంచి శ్రీనివాస్‌ వెంకట్రాఘవన్‌, సుందరం రవి వ్యవహరించారు. అయితే వీరిని గత ఏడాది ప్యానల్‌ నుంచి తప్పించారు. నితిన్ మీన‌న్‌ మూడు టెస్టులు, 24 వ‌న్డేలు, 16 టీ20ల‌కు అధికారిక అంపైర్‌గా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఎమిరేట్స్‌ ఐసీసీ ఇంటర్నేషనల్‌ అంపైర్స్‌ ప్యానల్‌లో నితిన్‌ ఉన్నాడు. ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్.. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. మ్యాచ్ రిఫరీలు రంజన్ మదుగలే, డేవిడ్ బూన్‌లతో కూడిన ప్యానెల్ నితిన్‌ను ఎలైట్‌ అంపైర్‌గా ఎంపిక చేసింది.

క‌ల తీరిన‌ట్లుగా ఉంది

క‌ల తీరిన‌ట్లుగా ఉంది

ప్ర‌స్తుతం లీడింగ్‌లో ఉన్న అంపైర్ల‌తో క‌లిసి అంపైరింగ్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌డం క‌ల తీరిన‌ట్లుగా ఉంద‌ని నితిన్ మీన‌న్‌ చెప్పారు. 'ఎలైట్ అంపైర్ల ప్యానెల్‌కు నన్ను ఎంపిక చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు ఇప్పుడు ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రపంచంలోని ప్రముఖ అంపైర్లు, రిఫరీలతో ఉన్న ఎలైట్‌ ప్యానల్‌లో చేరాలనేది తన కలగా ఉండేది. ఆ కల ఇన్నాళ్లకు నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నా' అని నితిన్‌ మీనన్ ఐసీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

నాన్న ప్రోత్సాహాంతోనే

నాన్న ప్రోత్సాహాంతోనే

'2004లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏ లిస్ట్ క్రికెట్ ఆడా. మా నాన్న న‌రేంద్ర మీన‌న్ అంత‌ర్జాతీయ అంపైర్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2006లో అంపైర్ల కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హించించింది. ఈ విషయం నాన్న నాతో చెప్పారు. ఆయన ప్రోత్సాహాంతో ప‌రీక్ష‌లు రాశాను. వాస్త‌వానికి దేశానికి క్రికెట్ ఆడాల‌నుకున్నా. కానీ 22 ఏళ్ల వ‌య‌సులోనే క్రికెట్‌ను వదిలేశా. 23 ఏళ్ల‌కే అంపైర్ అయ్యా. అప్ప‌టి నుంచి దానిపైనే పూర్తి ఫోక‌స్ పెట్టా. సవాళ్ళ కోసం ఎదురుచూస్తున్నా. నాకు లభించే ప్రతి అవకాశంలోనూ నా వంతు కృషి చేస్తా. భారతీయ అంపైర్లను ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. నా అనుభవాలను పంచుకోవడం ద్వారా వారికి సహాయం చేయగలుగుతా' అని నితిన్ మీన‌న్‌ పేర్కొన్నారు.

నితిన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా:

నితిన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా:

'నాకు ఈ అవకాశం వచ్చినందుకు అండగా నిలిచిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ, ఐసీసీలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. వారందరూ నాకు చాలా మద్దతుగా నిలిచారు. కెరీర్ కోసం నా కుటుంబం చేసిన త్యాగాలు, వారు ఇచ్చిన మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని నితిన్ మీన‌న్‌ అన్నారు. 'నితిన్ చాలా స్థిరమైన ప్రదర్శనలతో పైకి వచ్చాడు. ఎలైట్ ప్యానెల్‌కు ఎంపికైనందుకు నేను అతనిని అభినందిస్తున్నా. అతను విజయవంతం కావాలని కోరుకుంటున్నా' అని అంపైర్లు మరియు రిఫరీల ఐసీసీ సీనియర్ మేనేజర్ అడ్రియన్ గ్రిఫిత్ అన్నారు.

'ఆ మ్యాచ్‌కు 30 నిమిషాల కామెంటరీ అనుకుంటే.. 90 నిమిషాలు అయ్యింది'

Story first published: Monday, June 29, 2020, 16:00 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X