న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు: ఉద్వేగానికి లోనైన బెన్ స్టోక్స్

By Nageshwara Rao
New Zealand Vs England: Ben Stokes emotional after man-of-the-match display

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఉద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌‌లో ఆడుతున్న బెన్ స్టోక్స్ రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

England vs New Zealand 2018 2nd ODI Score Card

బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ మెరిసిన బెన్ స్టోక్స్‌ని మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న తర్వాత బెన్ స్టోక్స్ మాట్లాడాడు.

'మైదానంలో చివరి వరకు నాటౌట్‌గా నిలవడం అనేది అద్భుతమైన ఫీలింగ్. జట్టు మొత్తం అద్భుత ప్రదర్శన చేసింది. ఇది నాకు సంతృప్తిని కలిగిస్తోంది. చివర్లో మైదానం నుంచి బయటకు వచ్చేటప్పుడు కాస్త ఎమోషనల్‌కు గురయ్యా. నాకు అర్ధం అయింది, దేశం తరుపున ఆడటం గొప్ప గౌరవం' అని ఉద్వేగంగా చెప్పాడు.

'జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు గాను ఇంటి దగ్గర ఎంతో కష్టపడ్డాను. ఇంగ్లాండ్ తరుపున ప్రాతినిథ్యం వహించేందుకు నాకు మళ్లీ మరొక అవకాశం లభించింది. ఈసారి తలదించుకునేలా ప్రవర్తించను. ఇది నాకు ఎంతో ఊరట కలిగించడంతో పాటు సంతోషాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్ విజయాలు సాధించడంలో నా వంతు పాత్ర పోషిస్తా' అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌటైంది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో మిచెల్ సట్నర్ (63), మార్టిన్ గుప్టిల్ (50) రాణించగా, మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. 8 ఓవర్లు వేసిన బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీసి 42 పరుగులిచ్చాడు.

అనంతరం 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇయాన్ మోర్గాన్ (62), బెన్ స్టోక్స్ (63 నాటౌట్) పరుగులతో రాణించడంతో 37.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

తాజా విజయంతో ఐదు వన్డేల సిరిస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం (మార్చి 3)న జరగనుంది.

Story first published: Wednesday, February 28, 2018, 19:08 [IST]
Other articles published on Feb 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X