బెయిర్ స్టో సెంచరీ: ఐదు వన్డేల సిరిస్ ఇంగ్లాండ్ కైవసం

Posted By:
New Zealand Vs England: Bairstow scores ton as England crush Black Caps to claim ODI series

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను 3-2తో ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది.

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ఐదో వన్డే స్కోరు కార్డు

ఆఖరి వన్డేలో ఇంగ్లాండ్ విజయంలో జానీ బెయిర్ స్టో కీలకపాత్ర పోషించాడు. బెయిర్ స్టో సెంచరీ(60 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సులు)తో చెలరేగడంతో ఇంగ్లాండ్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 223 పరుగులకే ఆలౌటైంది.

న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్ శాంట్నర్ (67), నికోల్స్ (55) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, రషీద్ చెరో మూడు వికెట్లు తీసుకోగా... కరాన్ రెండు, మెయిన్ అలీ, మార్క్ వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.

అనంతరం కివీస్ నిర్ధేశించిన 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన 32.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (104), అలెక్స్ హేల్స్ (61) చక్కటి శుభారంభాన్నిచ్చారు. బెయిర్ స్టోర్ 58 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు.

సెంచరీతో రాణించిన జానీ బెయిర్ స్టోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.... క్రిస్ వోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. తాజా సిరిస్‌ను గెలుచుకోవడంతో ఇంగ్లాండ్ వరుసగా ఐదు వన్డే సిరిస్‌లను సొంతం చేసుకుంది.

Story first published: Saturday, March 10, 2018, 11:25 [IST]
Other articles published on Mar 10, 2018
Read in English: England claim ODI series

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి