న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

18 బంతుల్లో 5 వికెట్లు.. న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్‌ అనూహ్య ఓటమి!!

New Zealand vs England, 3rd T20I: Colin de Grandhomme help NZ beat ENG by 14 runs, take 2-1 lead in seriesNew Zealand vs England, 3rd T20I: Colin de Grandhomme help NZ beat ENG by 14 runs, take 2-1 lead in series


నెల్స‌న్‌ ఓవల్: మంగళవారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడ‌వ‌ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. నెల్స‌న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ నెగ్గింది. ఓ దశలో ఇంగ్లండ్‌ 2 వికెట్లకు 139 పరుగులు చేసి విజయంపై ధీమా ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకున్న న్యూజిలాండ్ బౌలర్లు 18 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి విజయాన్ని తనవైపు తిప్పారు. అర్ధ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.

వరుసగా రెండో ఏడాది.. టాప్‌-3లోనే కోహ్లీ, రోహిత్‌, ధోనీ!!వరుసగా రెండో ఏడాది.. టాప్‌-3లోనే కోహ్లీ, రోహిత్‌, ధోనీ!!

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మంచి ఆరంభమే లభించినా.. ఓపెనర్ మార్టిన్ గ‌ప్తిల్ (33), కోలిన్ మున్రో (6), టిమ్ సీఫెర్ట్ (7) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే గ‌ప్తిల్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గ్రాండ్‌హోమ్ (55) అర్ధ సెంచరీ చేసి ఆదుకున్నాడు. అతనికి టేల‌ర్ (27) మంచి సహకారం అందించాడు. చివరలో జేమ్స్ నీషమ్ (20), మిచెల్ సాంట్నర్ (15) బ్యాట్ జులిపించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో టామ్ కుర్రాన్ రెండు వికెట్లు తీసాడు.

181 లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెన‌ర్లు మంచి శుభారంభం ఇచ్చారు. డేవిడ్ మల‌న్ (55) అర్ధ సెంచరీ చేయ‌గా.. బాంట‌న్ (18) పరుగులు చేశాడు. ఇక వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్ ( 49) పరుగుల వరద పారించాడు. ఓ ద‌శ‌లో ఇంగ్లండ్ కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. దాదాపు విక్ట‌రీ ఖాయం అనుకున్న సమయంలో ఇంగ్లండ్ ప‌త‌నం ప్రారంభం అయ్యింది. కేవ‌లం 18 బంతుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి.. ప‌ది పరుగులు మాత్ర‌మే చేసింది. చివ‌రి ఓవ‌ర్‌లో 20 పరుగులు చేయాల్సిన దశలో .. ఇంగ్లండ్ కేవ‌లం 6 పరుగులు మాత్ర‌మే చేసింది. కివీస్ బౌలర్ టిమ్ సౌతీ చివరి ఓవ‌ర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్ళింది.

పుట్టినరోజున కోహ్లీ భావోద్వేగ లేఖ.. క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉండాలి!!పుట్టినరోజున కోహ్లీ భావోద్వేగ లేఖ.. క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉండాలి!!

వెల్లింగ్టన్‌ వేదికగా వెస్ట్‌పాక్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్తిల్‌ (41), జేమ్స్‌ నీషమ్‌ (42) ధాటిగా ఆడడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ మలన్‌ (39), ఇయాన్ మోర్గాన్‌ (32), క్రిస్‌ జోర్డాన్‌ (36) రాణించినా ఇంగ్లాండ్‌ ఓటమిపాలైంది.

Story first published: Tuesday, November 5, 2019, 14:00 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X