న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌‌ రెండో టీ20లో హైడ్రామా.. టార్గెట్ ఎంతో తెలియకుండానే బ్యాటింగ్!!

New Zealand vs Bangladesh: DL Method Drama, Bangladesh did not know the target they were chasing

నేపియర్‌: పొట్టి ఫార్మాట్‌లోనూ బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం కివీస్‌ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచులో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి సరికొత్త కన్‌ఫ్యూజన్‌కు దారి తీసింది. మ్యాచ్‌ రిఫరీ సరికొత్త రూల్స్‌ విషయంలో తికమకపడి లక్ష్యాన్ని రెండుసార్లు మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గంధరగోళానికి లోనై:

న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ జట్ల మ‌ధ్య జరిగిన రెండో టీ20కి వ‌ర్షం అడ్డుప‌డింది. ఆ స‌మయానికి న్యూజిలాండ్ 17.5 ఓవ‌ర్లలో 173 ప‌రుగులు చేసింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌కు 16 ఓవ‌ర్లలో 170 ప‌రుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే మారిన డ‌క్‌వ‌ర్త్ లూయిస్ పద్ధతిపై సరైన అవగాహన లేని బంగ్లా తాము ఛేజ్ చేయాల్సింది 16 ఓవ‌ర్లలో 148 ప‌రుగులు అని భావించి బ‌రిలోకి దిగింది. 1.3 ఓవ‌ర్ల త‌ర్వాత గంధరగోళానికి లోనై మ్యాచ్‌ రిఫరీని సంప్రదించగా.. ఆయన మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.

10 నిమిషాల చర్చల అనంతరం:

10 నిమిషాల చర్చల అనంతరం:

10 నిమిషాల చర్చల అనంతరం తిరిగి ప్రారంభంమైన మ్యాచ్‌లో తొలుత బంగ్లాకు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన మ్యాచ్‌ రిఫరీ.. ఆతరువాత దాన్ని 16 ఓవర్లలో 171 పరుగులుగా మార్చాడు. దీంతో మ్యాచ్‌ మధ్యలో పెద్ద హైడ్రామానే నెలకొంది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్‌ కొత్త రూల్స్‌ విషయంలో బంగ్లా జట్టు కన్‌ఫ్యూజ్‌ అయ్యిందంటే ఒక అర్ధముంది, ఏకంగా మ్యాచ్‌ రిఫరీనే కన్‌ఫ్యూజ్‌ అయ్యాడంటే రూల్స్‌ ఎంత తికమక పెడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు క్రికెట్‌ అభిమానులు. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 16 ఓవ‌ర్లలో 143 ప‌రుగులు మాత్రమే చేసి ఓట‌మి పాలైంది.

కివీస్‌ విజయం:

కివీస్‌ విజయం:

గ్లెన్‌ ఫిలిప్స్‌ (58; 31 బంతుల్లో 5×4, 2×6), డరిల్‌ మిచెల్‌ (34; 16 బంతుల్లో 6×4) చెలరేగడంతో మొదట కివీస్‌ 5 వికెట్లకు 173 పరుగులు సాధించింది. వాన కారణంగా 17.5 ఓవర్ల వద్దే కివీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించారు. లక్ష్యాన్ని 16 ఓవర్లలో 171 పరుగులకు సవరించగా.. బంగ్లా 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. సౌమ్య సర్కార్‌ (51), మహ్మద్‌ నైమ్‌ (38) మెరవడంతో 10 ఓవర్లు ముగిసే సరికి 94/1తో బలంగా ఉన్న బంగ్లా.. ఆ తర్వాత గతి తప్పింది. సౌథీ, బెన్నెట్‌, మిల్నె రెండేసి వికెట్లు పడగొట్టారు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-0తేడాతో కైవసం చేసుకుంది.

Story first published: Wednesday, March 31, 2021, 8:30 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X