న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌ను ఓడించి కివీస్ సెమీస్ ఫైనల్ బెర్తు కన్ఫమ్ చేసుకునేనా?

ICC Cricket World Cup 2019 : New Zealand Vs Australia Match Preview ! || Oneindia Telugu
New Zealand vs Australia match, Weather Update in London today: Clear skies expected as Kiwis look to seal semi-final spot

హైదరాబాద్: ప్రపంచకప్‌లో మరో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరకు రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో భారత్‌-పాక్ మ్యాచ్‌ అంటే ఎంత ఆసక్తికరమో.. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్ అన్నా అంతే అభిమానులకు అంతే ఉత్సాహకరం. ఈ మెగా మ్యాచ్‌కు శనివారం లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో ఒక్క భారత్‌తో మినహా మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో మొత్తం 12 పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా నిలిచింది. మరోవైపు టోర్నీలో ఓటమి అన్నదే లేకుండా సాగుతున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే.

11 పాయింట్లతో మూడో స్థానంలో న్యూజిలాండ్

11 పాయింట్లతో మూడో స్థానంలో న్యూజిలాండ్

దీంతో ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి 11 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. నాకౌట్‌లో ప్రవేశించాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగే మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలవాల్సి ఉంటుంది. 2015 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతుంటే.. ఈ మెగా టోర్నీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆసీస్ భావిస్తోంది.

ముఖాముఖి రికార్డు

ముఖాముఖి రికార్డు

రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 136 మ్యాచ్‌లు జరగ్గా 90 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 39 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ నెగ్గాయి. ఏడింట్లో ఫలితం తేలలేదు. ఇక, ప్రపంచకప్ విషయానికి వస్తే ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరగ్గా ఏడింట్లో ఆసీస్, మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌ గెలుపొందింది.

టోర్నీలో అత్యధిక పరుగులు, వికెట్లు

టోర్నీలో అత్యధిక పరుగులు, వికెట్లు

బ్యాటింగ్‌లో ఓపెనర్లు కెప్టెన్‌ ఫించ్, వార్నర్, బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌ కంగారూలను ముందుండి నడిపిస్తున్నారు. ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల, వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది కూడా కంగారూలే. ఓపెనర్లు వార్నర్ (500), ఫించ్ (496) పరుగుల వరద పారిస్తున్నారు. వీరిద్దరూ ప్రతీ మ్యాచ్‌లోనూ మంచి భాగస్వామ్యాలను నమోదు చేయడంతో ఆసీస్‌కు ఎదురులేకుండా పోయింది. ఇక, బౌలింగ్‌లో స్టార్క్, బెరెన్‌డార్ఫ్, కమ్మిన్స్‌ను న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

పెద్ద సమస్యగా మారిన ఓపెనర్ల పేలవ ఫామ్‌

పెద్ద సమస్యగా మారిన ఓపెనర్ల పేలవ ఫామ్‌

న్యూజిలాండ్‌కు ఓపెనర్ల పేలవ ఫామ్‌ పెద్ద సమస్యగా మారింది. ఓపెనర్లు గప్టిల్, మన్రో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండటంతో కివీస్‌కు సరైన ఆరంభాలు లభించడం లేదు. వీరిద్దరూ టోర్నీలో ఇప్పటివరకు ఒక్కో అర్ధ శతకం మాత్రమే చేశారు. అద్భుత ఫామ్‌తో గట్టెక్కిస్తున్న కెప్టెన్‌ విలియమ్సన్‌... పాక్‌తో మ్యాచ్‌లో సాధారణ స్కోరుకు పరిమితం కావడం ఓటమికి కారణమైంది. టేలర్ ఫర్వాలేదనిపిస్తున్నా... లాథమ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. బౌలింగ్‌లో బౌల్ట్, ఫెర్గూసన్, సౌథీ మంచి ఫామ్‌లో ఉన్నారు.

Story first published: Saturday, June 29, 2019, 10:48 [IST]
Other articles published on Jun 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X