న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త ఇన్నింగ్స్: రాజకీయాల్లో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్

New Innings: Mashrafe Mortaza to contest in upcoming general elections in Bangladesh

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ మష్రఫే మోర్తజా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఆదేశ జట్టు వన్డే కెప్టెన్‌గా కొనసాగుతోన్న మష్రఫే మోర్తజా రాజకీయల్లోకి కూడా అరంగేట్రం చేశాడు. ఇందులో భాగంగా బంగ్లా అధికార పార్టీ అవామీ లీగ్‌ తరఫున వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అతడు పోటీ చేయనున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందే గాడిలో పడిన ధావన్, పంత్!ఆస్ట్రేలియా పర్యటనకు ముందే గాడిలో పడిన ధావన్, పంత్!

ఈ మేరకు అవామీ లీగ్‌ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు 35 ఏళ్ల మష్రఫే మోర్తజా నరైల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ తరఫున ఆదివారం నామినేషన్‌ పత్రాలను అందుకున్నట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్ క్రికెట్‌లో మష్రఫే మోర్తజాకి రాక్‌స్టార్ స్టేటస్ ఉంది.

అతడి క్రేజ్‌ని ఓట్ల రూపంలో మరల్చుకునేందుకు ఇప్పటికే అవామీ లీగ్‌ పార్టీ బంగ్లాదేశ్‌లోని ప్రముఖ పేపర్లలో ప్రస్తుతం ప్రధాని షేక్ హసీనాతో పాటు మష్రఫే మోర్తజా ఫోటోలను ప్రచురించింది. ఈ ప్రకటనలకు ముందు మోర్తజా బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో సమావేశమయ్యాడు.

వెస్ట్రన్ బంగ్లాదేశ్‌లోని మష్రఫే మోర్తజా హోం టౌన్ నరైల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆమెతో వెల్లడించాడు. ఇందుకు ఆమె కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అవామీ లీగ్‌ పార్టీ అధికార ప్రతినిధి మహబుబుల్ ఆలం హన్సీఫ్ పేర్కొన్నారు.

మరోవైపు ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించినా ప్రస్తుతానికి క్రికెట్‌పై దృష్టి పెట్టాల్సిందిగా ప్రధాని అతడికి సూచించినట్టు తెలిసింది. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో షేక్ హసీనా విజయం సాధిస్తే వరుసగా మూడోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

దక్షిణ ఆసియాలో క్రికెటర్లు రాజకీయాల్లోకి ప్రవేశించడం ఇదేం కొత్తేం కాదు. పాక్‌లో ఇమ్రాన్ ఖాన్, భారత్‌లో అజహరుద్దీన్, శ్రీలంకలో అర్జున రణతుంగ ఇలా పలువురు క్రికెటర్లు మైదానం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవంతమయ్యారు. ఇక, మోర్తజా వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

ఇప్పటికే మోర్తజా టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2009 నుంచి టెస్టు క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు. మోర్తజా అభిమానులు సైతం అతడి నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ, రాజీకీయాల్లో అతడు ఏ మేరకు రాణిస్తాడనేది తెలియాల్సి ఉంది.

Story first published: Monday, November 12, 2018, 17:23 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X