న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U-turn రాయుడు: సోషల్ మీడియాలో నెటిజన్ల ఎగతాళి!

Ambati Rayudu Trolled For Taking U-Turn On Retirement || Oneindia Telugu
Netizens call Ambati Rayudu India’s Shahid Afridi after he takes U-turn on retirement

హైదరాబాద్: తెలుగుతేజం, భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తన రిటైర్మెంట్‌‌ని వెనక్కి తీసుకోవడంపై U-turn రాయుడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. దీంతో అతడు మళ్లీ బ్యాట్‌ పట్టుకుని మైదానంలోకి దిగబోతున్నాడు. రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు.

సెప్టెంబర్ 10 నుంచి ఎప్పుడైనా హైదరాబాద్‌ జట్టుతో చేరడానికి సిద్ధమని రాయుడు తెలిపాడు. దీంతో అంబటి రాయుడిని భారత షాహిద్‌ అఫ్రిది అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. 'వస్తాడు, వెళ్తాడు... మళ్లీ తిరిగొస్తాడు' అని ఓ నెటిజన్ పోస్టు చేయగా... మరొక నెటిజన్ 'భారత షాహిద్‌ అఫ్రిది ఇతడు' అంటూ కామెంట్ పెట్టాడు.

2nd Test, Day 1 Highlights: కోహ్లీ హాఫ్ సెంచరీ, టీమిండియా 264/5

ఇతడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం

ఇతడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం

‘శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, మనీశ్‌ పాండే పరిస్థితి ఇదీ' అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేయగా.... ఇంకొకరు ‘ఇతడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, అందుకు చాలా పనిచేయాలి' అని ట్వీట్ చేశాడు. గత రెండేళ్లుగా టీమిండియా తరఫున నిలకడగా ఆడిన రాయుడిని ఎమ్మేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదు.

రాయుడి స్థానంలో విజయ్‌ శంకర్‌

రాయుడి స్థానంలో విజయ్‌ శంకర్‌

రాయుడి స్థానంలో విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు. దీంతో ప్రపంచకప్‌ను వీక్షించేందుకు ‘3డీ' కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ట్వీట్‌ చేశాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అనంతరం వరల్డ్‌కప్‌లో టోర్నీలో శిఖర్‌ ధావన్‌, విజయ్ శంకర్‌ గాయపడ్డా బ్యాకప్‌గా ఉన్న రాయుడిని ఎంపిక చేయకుండా అతడి స్థానంలో మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు.

వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ధన్యవాదాలు

వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ధన్యవాదాలు

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు గత జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, గురువారం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. 'నా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. ఇక అన్ని ఫార్మాట్లో క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నా. గడ్డుకాలంలో నాకు మద్దతుగా నిలిచి, నాలో ఇంకా క్రికెట్‌ మిగిలి ఉందని చెప్పిన సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ధన్యవాదాలు' అని బీసీసీఐ, హెచ్‌సీఏకు పంపిన లేఖలో రాయుడు పేర్కొన్నాడు.

హెచ్‌సీఏ ప్రకటనలో ఇలా!

హెచ్‌సీఏ ప్రకటనలో ఇలా!

'క్రికెట్‌కు రిటైర్మెంట్‌ పలకాలనే నిర్ణయం ఎంతో భావోద్వేగంతో తీసుకున్నది. ఆ సమయంలో చాలా బాధపడ్డా. అందరూ నాతో మాట్లాడడంతో తిరిగి ఆలోచించా. హైదరాబాద్‌ తరపున తిరిగి ఆడేందుకు ఏంటో ఉత్సాహంగా ఉన్నా. హైదరాబాద్‌ జట్టు పూర్తిస్థాయిలో సత్తా చాటేందుకు నా సహకారం అందిస్తా. వచ్చే నెల 10 నుంచి జట్టుతో చేరేందుకు సిద్ధం' అని రాయుడు స్పష్టం చేసాడు. 'రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. హెచ్‌సీఏ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు అతడు అందుబాటులో ఉంటాడు' అని హెచ్‌సీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

Story first published: Saturday, August 31, 2019, 12:11 [IST]
Other articles published on Aug 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X