న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిత్తుగా ఓడిన లంక: టెస్ట్ చ‌రిత్ర‌లో అతిపెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసిన కోహ్లీసేన

By Nageshwara Rao
Jadeja removes Karunaratne early as SL chase India's mammoth lead

హైదరాబాద్: రెండో టెస్టులో భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయం రికార్డును కోహ్లీసేన సమం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టులో శ్రీలంకపై భారత్ ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరొక్క పరుగు ఆదా చేసి ఉంటే కోహ్లీసేన తన పేరును చరిత్రలో లిఖించుకుని ఉండేది. 2007లో బంగ్లాదేశ్‌పై కూడా ఇలానే ఇన్నింగ్స్ 239 ప‌రుగుల తేడాతోనే టీమిండియా విజయం సాధించింది. టెస్టుల్లో భారత జట్టుకు ఇదే అతిపెద్ద విషయం కావడం విశేషం. దీంతో ఆ రికార్డుని ఇప్పుడు కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సమం చేసింది.

నాలుగో రోజైన సోమవారం లంచ్ విరామం అనంతరం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఈ టెస్టులో చివరి వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు.

India wins second test against Sri Lanka

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో 3 టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులకే ఆలౌట్ కాగా... భారత్ 610/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (213) డబుల్ సెంచరీ చేయగా మురళీ విజయ్ (128), పుజారా (143), రోహిత్ శర్మ (102) సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.


ఓటమి దిశగా శ్రీలంక
నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ విజయానికి చేరువైంది. లంచ్ విరామానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. చండీమాల్ 53, సురంగ లక్ష్మల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే శ్రీలంక 260 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కాగా, నాలుగో రోజైన సోమవారం భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీశాడు. మొదటి బంతికి పెరీరాను, మూడో బంతికి హెరాత్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరూ డకౌట్ అవడం విశేషం.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో శ్రీలంక ఓటమి దిశగా సాగుతోంది. స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌‌తో మెరుపులు మెరిపించిన శ్రీలంక బౌలర్ షనక(17)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో షనక రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు.

ఇన్నింగ్స్ 34వ ఓవర్‌ మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన షనక.. కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ చాందిమల్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సమయానికి లంక 6 వికెట్లు నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో చండీమాల్‌(34,) పెరీరా పరుగులేమీ చేయకుండా ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే శ్రీలంక 298 పరుగులు వెనుకబడి ఉంది.

Jadeja removes Karunaratne early as SL chase India's mammoth lead

నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
నాగ్‌పూర్ టెస్టులో భారత బౌలర్లు చెలరేగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ తమ హవా కొనసాగిస్తున్నారు. ఫలితంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. పది పరుగులు చేసిన మాథ్యూస్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. జడేజా వేసిన 26వ ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న మాథ్యూస్‌(10) రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

అంతకుముందు 21వ ఓవర్లో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి తిరిమన్నే(23) జడేజాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంక 27 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. చాందిమల్ 17, డిక్వెల్లా ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే శ్రీలంక 335 పరుగులు వెనుకబడి ఉంది.

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన తిరిమన్నెను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగో రోజు కోహ్లీ బౌలింగ్ మార్పు జట్టుకు కలిసొచ్చింది. తొలిసారి జడేజా, రెండోసారి ఉమేష్ విజయవంతమయ్యారు.

భారత్-శ్రీలంక స్కోరు కార్డు

ఈ టెస్టులో లంకకు గెలుపుపై ఆశలు లేకపోయినా, మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే కచ్చితంగా నిలవాల్సిన సమయంలో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం శ్రీలంక 21 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. చండీమాల్ 4, మ్యాథ్యూస్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే శ్రీలంక 353 పరుగులు వెనుకబడి ఉంది.

నాలుగో రోజు ప్రారంభమైన ఆట
నాగ్‌పూర్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 21/1తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన శ్రీలంక బ్యాట్స్‌మన్లు అశ్విన్, ఇషాంత్ బౌలింగ్‌ను అలవోకగా ఆడారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ నుంచి బంతిని అందుకున్న రవీంద్ర జడేజా కరుణరత్నెను(18) పెవిలియన్‌కు పంపాడు.

ఇన్నింగ్స్ 15.2వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని ఎదుర్కొన్న కరుణరత్నే(18) మురళీ విజయ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరాడు. దీంతో శ్రీలంక 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. తిరిమన్నె 17, మ్యాథ్యూస్ ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే శ్రీలంక 369 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 405 పరుగుల భారీ ఆధిక్యంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 27, 2017, 14:27 [IST]
Other articles published on Nov 27, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X