న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ప్రేమ, బలం, గేమ్ చేంజర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: రోహిత్

My love, strength and game changer: Rohit Sharma shares post for wife Ritika on her birthday

కటక్: డిసెంబర్‌ 21 (శనివారం)న హిట్‌మ్యాన్‌, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రోహిత్‌ తన భార్యకు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'నా ప్రేమ, బలం, గేమ్ చేంజర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుకు నడిపించే ఒక వెలుతురు మా జీవితాలపై ప్రసరించినందుకు సమైరా, నేను గర్వపడుతున్నాం' అని రోహిత్‌ పోస్ట్‌ చేసాడు.

<strong>క్రిస్‌ జోర్డాన్‌ కళ్లుచెదిరే క్యాచ్‌.. షాక్‌కు గురైన క్రిస్టియాన్‌ (వీడియో)!!</strong>క్రిస్‌ జోర్డాన్‌ కళ్లుచెదిరే క్యాచ్‌.. షాక్‌కు గురైన క్రిస్టియాన్‌ (వీడియో)!!

2015లో వివాహం

2015లో వివాహం

రోహిత్ శర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆరేళ్లు ప్రేమించుకున్న రితిక, రోహిత్‌ 2015లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు సమైరా అనే చిన్నారి ఉంది. మైదానంలో బౌలర్లపై నిర్దాక్షిణంగా విరుచుకుపడే రోహిత్ శర్మకు రితిక, సమైరా అంటే ఎంతో ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా రోహిత్ తన కుటుంబంతో సరదాగా గడుపుతాడు.

తొలి వన్డేలో సెంచరీ

తొలి వన్డేలో సెంచరీ

రోహిత్‌ సతీమణి రితిక గతేడాది డిసెంబర్‌ 31న ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఆసీస్‌ పర్యటనలో ఉన్న రోహిత్‌.. విషయం తెలియగానే ముంబైకి చేరుకున్నాడు. ఈ సంవస్తరం జనవరి 6న తన కూతురు పేరు 'సమైర' అని ట్విటర్‌లో తెలిపాడు. మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాకు వెళ్లి సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసాడు.

కూతురు పుట్టిన వేళ:

కూతురు పుట్టిన ఈ ఏడాది రోహిత్ శర్మకు బాగా కలిసొచ్చింది. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా హిట్‌మ్యాన్‌ హవా సాగింది. ఈ ఏడాది మొత్తం పది సెంచరీలు బాదిన రోహిత్ వన్డేల్లో 7, టెస్టుల్లో 3 సాధించాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు టైటిల్‌ సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో విశ్వరూపం చూపించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Story first published: Tuesday, July 7, 2020, 15:26 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X