మైఖేల్ ఫాంటసీ చిట్కాలు: ఏప్రిల్ 7న ముంబై Vs చెన్నై

Posted By:
My Khel Fantasy Tips - Mumbai vs Chennai on April 7

హైదరాబాద్: ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో కూడా సత్తా చాటాలని చూస్తోంది.

రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. గతంలో సాధించిన విజయాలను రిపీట్ చేయాలనే కసితో ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ స్వల్ప మార్పులతో ఈ సీజన్‌లో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే చెన్నై ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేసి ఫామ్‌లోకి వచ్చారు.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్‌లో తిరిగి తమ పూర్వ వైభవాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో తొలి మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల మద్దుతు ఆ జట్టుకే ఉండే అవకాశం ఉంది.

జట్టులో ఇతడు ఉంటే బాగుండు:
ఇషాన్ కిషన్... ప్రస్తుతం ఐపీఎల్‌లో రాణించే సామర్థ్యం ఉన్న యువ క్రికెటర్. అటు బ్యాట్స్‌మన్‌గా వికెట్ కీపర్‌గా పనికొస్తాడు. వేగంగా పరుగులు చేయడంతో పాటు బోనస్ పాయింట్లు కూడా సాధిస్తాడు. ఇషాన్ కిషన్ కేవలం రూ.8కే అందుబాటులో ఉన్నాడు.

అత్యుత్తమ కెప్టెన్లు & వైస్ కెప్టెన్లు:
ఐపీఎల్ విషయానికి వస్తే సురేశ్ రైనా ఓ అద్భుతమైన క్రికెటర్. అతడికి మిస్టర్ ఐపీఎల్‌ అనే పేరు కూడా ఉంది. ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. గత ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ తరుపున ఆడిన రైనా 14 మ్యాచ్‌ల్లో 40.18 యావరేజి, 144 స్ట్రైక్ రేట్‌తో 442 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక, ఐపీఎల్‌లో 2500కిపైగా పరుగులు, 75కి పైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ షేన్ వాట్సన్. గత పది సీజన్లలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్. 2008, 2013లో షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని అందుకున్నాడు. దీంతో షేన్ వాట్సన్‌తో మురళీ విజయ్ ఓపెనర్‌గా జత కలిస్తే బాగుంటుంది. బౌలింగ్ విషయానికి వస్తే వాట్సన్ డెత్ ఓవర్లలో కట్టర్స్, యార్కర్లతో రాణించగలుగుతాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్, బీబీఎల్‌ ప్రాంఛైజీ తరుపున అనుభవం వాట్సన్ సొంతం.

తెలివైన ఎంపిక:
ఐపీఎల్ కెరీర్‌ను ఇమ్రాన్ తాహిర్ ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ... 32 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 24.46 యావరేజితో 8.21 ఎకానమీతో 47 వికెట్లు పడగొట్టి తానెంటే నిరూపించుకున్నాడు. ఈ లీగ్‌లో తాహిర్ చెన్నై తరుపున అద్భుత ప్రదర్శన చేయడంతో ఎటువంటి సందేహాం లేదు.

ఫరిశీలించి ఎంపిక చేసుకోవాల్సిన ఆటగాళ్లు:
ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీలో భారత్ తరుపున శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన చేశాడు. శార్దూల్ ఠాకూర్ గత 2 ఫాంటసీ స్కోర్లు (-10), (10)గా ఉన్నాయి. ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను తన బౌలింగ్‌తో బెంబేలెత్తించే సత్తా ఉన్నప్పటికీ, ఎక్కువ పరుగులిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఠాకూర్‌ని జట్టులోకి ఎంపిక చేసుకోవడం రిస్క్‌తో కూడుకున్నదే.

నా జట్టు:
సురేశ్ రైనా(కెప్టెన్), షేన్ వాట్సన్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, ఇమ్రాన్ తాహిర్, రోహిత్ శర్మ, ఎవిన్ లూయిస్, జస్ప్రీత్ బుమ్రా, ఆసిఫ్, ప్యాట్రిక్ కుమ్మిన్స్, కృనాల్ పాండ్యా, కేదార్ జావద్

మైఖేల్ తెలుగులో క్రికెట్ ఫాంటసీ లీగ్ ఆడాలనుకునే అభిమానులు ఇక్కడ క్లిక్ చేయండి

(Source: CricBattle)

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 5, 2018, 19:46 [IST]
Other articles published on Apr 5, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి