న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ అత్యుత్తమ టీ20 బౌలర్ బుమ్రా.. అతడితో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఉన్నా: ఆసీస్ పేసర్

Mumbai Indians pacer James Pattinson Says Jasprit Bumrah Best T20 Bowler In The World

అబుదాబి: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచ అత్యుత్తమ టీ20 బౌలర్ అని ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌ ప్రశంసించాడు. ఐపీఎల్‌ 2020లో బుమ్రాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం తనకు గొప్ప అనుభవమని ముంబై ఇండియన్స్ పేసర్ ప్యాటిన్‌సన్‌ చెప్పాడు. ఐపీఎల్ 2020 సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగనున్నాయి.

 అత్యుత్తమ టీ20 బౌలర్ బుమ్రా:

అత్యుత్తమ టీ20 బౌలర్ బుమ్రా:

తాజాగా ముంబై ఇండియన్స్‌ టీవీతో ‌జేమ్స్‌ ప్యాటిన్‌సన్ మాట్లాడుతూ.... 'ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 జట్టులో భాగమయినందుకు సంతోషంగా ఉంది. అత్యుత్తమ బౌలర్లతో కలిసి పనిచేయడం అద్భుతం. జస్ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ టీ20 బౌలర్‌. అతనితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా. ముంబై జట్టులో ట్రెంట్ బౌల్ట్‌ కూడా ఉన్నాడు. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం ఇస్తుంది' అని తెలిపాడు. సెప్టెంబర్‌ 19న జరిగే లీగ్‌ ఆరంభ మ్యాచులో రన్నరప్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది.

పిచ్‌లు నెమ్మదిస్తాయ్‌:

పిచ్‌లు నెమ్మదిస్తాయ్‌:

'గతంలో నేను యూఏఈలో వన్డేలు ఆడాను. అక్కడి పిచ్‌లపై నాకు కొంత అనుభవం ఉంది. కాలం గడిచే కొద్దీ వికెట్లు పొడిగా మారుతాయి. అందుకే స్కోర్లు తక్కువగా నమోదవుతాయి. స్లో బంతులకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ బౌలర్లకు వికెట్లు తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా శక్తిమేర రాణిస్తా. ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తా' అని జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌ అన్నాడు. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని ముంబై ఇండియన్స్‌ ప్యాటిన్‌సన్‌తో భర్తీ చేసింది.

39 టీ20లు.. 47 వికెట్లు:

39 టీ20లు.. 47 వికెట్లు:

ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ప్యాటిన్సన్‌ను గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ ప్లేయర్ వేలంలో ఏ ప్రాంచైజీ కొనుగోలుచేయలేదు. ప్యాటిన్సన్ కనీస ధర రూ .1 కోట్లు. కాగా లసిత్ ఐపీఎల్ 2020 నుంచి తప్పుకోవడంతో అతన్ని ముంబై తీసుకుంది. ప్యాటిన్‌సన్‌కు కొంతకాలంగా ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కట్లేదు. ఆసీస్ తరఫున 2015 సెప్టెంబర్లో జరిగిన వన్డేలో ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ప్యాటిన్సన్ ఇప్పటివరకు 21 టెస్టుల్లో, 15 వన్డేల్లో, 4 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 39 టీ20లు ఆడిన అతడు 8.25 ఎకానమీతో 47 వికెట్లు పడగొట్టాడు.

IPL 2020లో తెలుగు వ్యాఖ్యాతగా టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్!!

Story first published: Wednesday, September 16, 2020, 10:57 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X