న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేలా జయవర్ధనే, డైరెక్టర్ జహీర్‌ఖాన్‌లకు పదవులు మారాయి.. ఎంఐకి కొత్త కోచ్

Mumbai Indians Franchise Gave New Roles to MI Head coach Jayawardhane, Director Zaheer khan

ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే, డైరెక్టర్ జహీర్ ఖాన్‌లను ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం కొత్త రోల్స్‌లో నియమించింది. దీంతో వీరిద్దరు తమ పదవుల నుంచి వైదొలగనున్నారు. ముంబై ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఇండియన్స్‌తో పాటు ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్‌టౌన్‌ జట్లతో కూడిన MI 'OneFamily' అనే సెంట్రల్ టీం మేనేజ్‌మెంట్ చూసుకునేందుకు రిలియన్స్ యాజమాన్యం వీరిద్దరికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. తద్వారా ముంబై ఫ్రాంచైజీ జట్లలో ఒకే తరహా క్రికెట్ బ్రాండ్, విలువలు ఉండేలా చూసేందుకు యాజమాన్యం అడుగులు వేస్తోంది.

ముంబై మూడు జట్ల బాధ్యతల్లో జయవర్ధనే..

ఇప్పటికే కొన్నేళ్లుగా ముంబై తరఫున పనిచేస్తున్న మహేల జయవర్ధనే, జహీర్ ఖాన్‌లు ఎంఐ కట్టుబాట్లపై మంచి అవగాహన కలిగి ఉన్నారు. అలాగే వారి ఆధ్వర్యంలో జట్టు విన్నింగ్ పర్సంటేజీ కూడా బాగుంది. దీంతో మహేల జయవర్ధనే‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ MIగా కొత్త బాధ్యతల్లో యాజమాన్యం నియమించింది. సెంట్రల్ టీం వ్యూహాత్మక ప్రణాళిక, సమీకృత గ్లోబల్ హై-పెర్ఫార్మెన్స్ ఎకో-సిస్టమ్‌ను సృష్టించడం, ప్రతి జట్టు కోచింగ్‌కు బాధ్యతతో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ క్రికెట్ కార్యకలాపాలకు సీనియర్ నాయకత్వాన్ని మహేలా అందించనున్నారు. జట్ల స్ట్రక్చర్‌లు, సినర్జీలను కూడా మహేలా చూసుకుంటాడు. అలాగే మూడు జట్ల టీమ్ హెడ్ కోచ్‌లతో సన్నిహితంగా పని చేస్తూ ఎంఐ బ్రాండ్ ఆటను తీసుకువచ్చేలా మహేలా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

కొత్త ప్రతిభను గుర్తించే బాధ్యతల్లో జహీర్

ఇకపోతే జయవర్ధనేకు గ్లోబల్ హెడ్ పొజిషన్ దక్కడంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు అలాగే MI ఎమిరేట్స్, MI కేప్‌టౌన్‌ జట్లకు కొత్తగా ప్రధాన కోచ్‌లు నియమితులు కానున్నారు. ఈ ప్రధాన కోచ్‌లు శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనేకు నివేదించనున్నారు. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ గ్లోబల్ హెడ్‌ ఆఫ్ డెవలప్ మెంట్‌గా నియమితులయ్యారు. క్రికెట్ డెవలప్‌మెంట్, ప్లేయర్ డెవలప్‌మెంట్‌కు జహీర్ బాధ్యత వహిస్తాడు. ప్రతిభను గుర్తించడం, ఎంఐ ప్రోగ్రామ్‌ను రూపొందించడం తదితర కార్యకలాపాలు జహీర్ ఆధ్వర్యంలో జరుగుతాయి.

ఒకే విధమైన బ్రాండ్ క్రికెట్ కోసం : ఆకాష్ అంబానీ

ఒకే విధమైన బ్రాండ్ క్రికెట్ కోసం : ఆకాష్ అంబానీ

‘మా గ్లోబల్ కోర్ టీమ్‌లో మహేల, జహీర్ చేరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరూ ఎంఐ కుటుంబంలో చాలా ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నారు. ఎంఐ క్రికెట్ స్ఫూర్తిని వారు ప్రతిబింబిస్తారు. వారు ప్రపంచవ్యాప్తంగా మా జట్లన్నింటిలో ఒకే విధమైన బ్రాండ్ క్రికెట్ నెలకొల్పేలా చర్యలు చేపడతారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా జట్టు క్రికెట్ వ్యవస్థలలో మంచి మార్పులను తీసుకురాగలరని నేను విశ్వసిస్తున్నాను' అని ఆకాష్ అన్నారు.

అంబానీ నాయకత్వాన్ని కొనియాడిన జయవర్ధనే

అంబానీ నాయకత్వాన్ని కొనియాడిన జయవర్ధనే

ఎంఐ గ్లోబల్ క్రికెట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు జయవర్ధనే తెలిపాడు. ఆకాష్ అంబానీ నాయకత్వం, మార్గదర్శకత్వం ఎంఐనీ అత్యంత విలువైన గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీగా మార్చింది. గ్లోబల్ బ్రాండ్ క్రికెట్‌ను నిర్మించేందుకు నేను ఈ కొత్త బాధ్యత కోసం ఎదురు చూస్తున్నాను అని జయవర్ధనే ఓ ప్రకటనలో తెలిపాడు. ‘ఈ కొత్త పాత్రను స్వీకరించడానికి సంతోషిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు. ముంబై ఆటగాడిగా, కోచింగ్ టీమ్ మెంబర్‌గా ఇన్నాళ్లు ఉన్నాను. ఇప్పుడు కొత్త ప్రయాణం కోసం వేచిచూస్తున్నాను. కొత్త ప్రతిభను ఎంఐకి అందించడానికి ప్రయత్నిస్తాను' అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కొత్త కోచ్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

Story first published: Wednesday, September 14, 2022, 12:40 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X