న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్ బైక్‌తో రాంచీ వీధుల్లో రయ్ రయ్‌మంటూ పోతోన్న ధోని (వీడియో)

MS Dhoni Riding Kawasaki H2 Super Bike At JSCA International Cricket Stadium
MS Dhoni spotted with his black and green Kawasaki H2 Superbike at JSCA international cricket stadium

హైదరాబాద్: క్రికెట్‌కు రెండు నెలలు సుదీర్ఘ విరామం ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. రాంచీలోని జార్ఖండ్ స్టేటే క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తన ప్రాక్టీస్ ముగించుకుని తన బ్లాక్ అండ్ గ్రీన్ కవాసకీ హెచ్2 సూపర్ బైక్‌పై ఇంటికి వెళుతోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోని ప్రస్తుతం రాంచీలోనే కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంటివద్ద ఉన్నప్పుడు బైక్ నడిపే అవకాశం వస్తే మాత్రం ధోని అస్సలు వదులుకోడు. ఎందుకంటే ధోనికి బైకులు లేదా కార్లు అంటే ఎంతో ఇష్టం. ధోని బయోపిక్‌లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అతడి వద్ద మొత్తం 74 అత్యాధునిక బైకులు ఉన్నట్లు తెలిపాడు.

<strong>22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున: భారత ఆటగాళ్లపై పాక్ ఫ్యాన్స్ రాళ్ల దాడి!</strong>22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున: భారత ఆటగాళ్లపై పాక్ ఫ్యాన్స్ రాళ్ల దాడి!

ధోని బైక్ కలెక్షన్‌లో

ధోని బైక్ కలెక్షన్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి డుకాటీ 1098, కవాసకీ నింజా ZX14R, హార్లే డేవిడ్‌సన్ ప్యాట్‌బాయ్, మయహా YZF600 థండర్ క్యాట్. 2015లో భారత్‌లో అత్యంత ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసిన క్రికెటర్‌గా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఆ బైక్ ఎక్స్ షోరూమ్ ఖరీదు రూ. 29 లక్షలు.

భారత ఆర్మీకి సేవ చేసేందుకు

భారత ఆర్మీకి సేవ చేసేందుకు

వరల్డ్‌కప్ తర్వాత భారత ఆర్మీకి సేవ చేసేందుకు గాను ధోని క్రికెట్‌ నుంచి రెండు నెలలు పాటు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విరామంలో ధోని తనంతట తానుగా వెస్టిండిస్, దక్షిణాప్రికా పర్యటనలకు దూరమయ్యాడు. అయితే, సెప్టెంబర్ నెలలో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లా సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

ధోని కీలక నిర్ణయం

ధోని కీలక నిర్ణయం

వరల్డ్‌కప్‌లో అయిన గాయం కారణంగా ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌కు ధోని వెన్నునొప్పితోనే వెళ్లాడు. టోర్నీ సమయంలో ఆ నొప్పి తీవ్రతరం అవడంతో పాటు నాకౌట్ మ్యాచ్‌లో ధోని చేతికి మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకుని నవంబర్ నాటికి ధోని ఫిట్ అవుతాడని భావిస్తున్నారు.

నవంబర్ తర్వాతే

నవంబర్ తర్వాతే

ఈ కారణం చేతనే ధోని నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండడని చెప్పినట్లు సమాచారం. 38 ఏళ్ల ధోని ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పటికీ వెన్నునొప్పి మాత్రం అతడిని గత కొంతకాలంగా బాధిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా ధోని ఆడటం లేదు. ధోని స్థానంలో కెప్టెన్‌గా యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ ఎంపికయ్యాడు.

Story first published: Monday, September 30, 2019, 15:40 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X