న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరూ సాగనంపకముందే అతడే వెళ్ళిపోవాలి!!: ధోనీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni Should Be Going 'Without Being Pushed Out' Says Sunil Gavaskar || Oneindia Telugu
MS Dhoni should go without being pushed out says Sunil Gavaskar

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ధోనీ తన భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరూ పంపియకుండానే అతడే గౌరవంగా వెళ్ళిపోవాలి అని గవాస్కర్ సూచనలు చేశారు.

<strong>వైరల్ ఫొటోలు: పారిస్‌ వీధుల్లో సానియా చక్కర్లు.. సోదరి బ్యాచిలర్‌ పార్టీలో హల్‌చల్‌!!</strong>వైరల్ ఫొటోలు: పారిస్‌ వీధుల్లో సానియా చక్కర్లు.. సోదరి బ్యాచిలర్‌ పార్టీలో హల్‌చల్‌!!

సభ్యులతో అమెరికాలో:

సభ్యులతో అమెరికాలో:

ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ధోనిపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. విండీస్, సౌతాఫ్రికా పర్యటనల నుండి స్వయంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు.

ధోనీ మనసులో ఏముందో:

ధోనీ మనసులో ఏముందో:

ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెట్ దిగ్గజం గవాస్కర్ మాట్లాడుతూ... 'ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. భారత క్రికెట్‌లో తన భవిష్యత్తు ఏమిటో అతను మాత్రమే స్పష్టం చేయగలడు. ప్రస్తుతం ధోనీకి 38 ఏళ్లు. వచ్చే టి20 ప్రపంచకప్ సమయానికి అతని వయసు 39 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి భారత్ ఇప్పటికే ఓ నిర్ణయానికి రావాలి' అని అన్నారు.

అతడే గౌరవంగా వెళ్ళిపోవాలి:

అతడే గౌరవంగా వెళ్ళిపోవాలి:

'ధోనీ భారత జట్టుకు చాలా చేసాడు. అతని విలువ ఎప్పుడూ అలాగే ఉంటుంది. పరుగులు, స్టంపింగ్‌లు మాత్రమే కాదు మైదానంలో అతని సారథ్యం అద్భుతం. ఇప్పటికి కెప్టెన్ విరాట్ కోహ్లీతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ అతనికి సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి సొంత జీవితం ఉంటుంది. ధోనీని నేను ఎంతో గౌరవంగా చూస్తున్నా. ఎంతో మందిలో నేను కూడా అభిమానినే. ఎవరూ పంపియకుండానే అతడే గౌరవంగా వెళ్ళిపోవాలి' అని గవాస్కర్ పేర్కొన్నారు.

కోహ్లీ ట్వీట్:

కోహ్లీ ట్వీట్:

సందర్భమేమీ లేకపోయినా.. 2016 టీ20 ప్రపంచకప్‌లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని.. గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ధోనీ సతీమణి సాక్షి స్పందించారు. రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు.

రిటైర్మెంట్‌ వార్తల్లో నిజం లేదు:

రిటైర్మెంట్‌ వార్తల్లో నిజం లేదు:

ధోనీ రిటైర్మెంట్ వార్తలపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు జట్టుని ప్రకటించే సమయంలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్‌ అంశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపిన ఎమ్మెస్కే .. ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ధోనీ రిటైర్మెంట్‌, ప్రెస్‌ మీట్‌పై తమకు అధికారిక సమాచారం లేదని బీసీసీఐ సైతం పేర్కొంది.

Story first published: Friday, September 20, 2019, 11:44 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X