న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs IRE: టీమిండియాలో కొనసాగుతున్న ధోనీ సంప్రదాయం!

MS Dhoni’s style still continues, Hardik hands over his first series win to Umran

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు దూరమై మూడేళ్లు అవుతున్నా.. అతను నెలకొల్పిన సంప్రదాయం, పద్దతులు వారసత్వంగా కొనసాగుతున్నాయి. ధోనీ అనంతరం జట్టు సారథ్య బాథ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఆ ఘన వారసత్వాన్ని కొనసాగించగా.. అతని నుంచి జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ కూడా ఆ పద్దతులను అనుసరించాడు. తాజాగా ఐర్లాండ్‌పై కెప్టెన్‌గా టీ20 సిరీస్ గెలిచిన హార్దిక్ పాండ్యా సైతం ధోనీ వారసత్వాన్ని కొనసాగించాడు.

ఉమ్రాన్ చేతికి టైటిల్..

టైటిల్ అందుకున్న వెంటనే నేరుగా తీసుకెళ్లి యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ చేతికిచ్చాడు. డబ్లిన్ వేదికగా మంగళవారం రాత్రి ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. రెండు టీ20ల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకుంది. సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండటంతో ద్వితీయ శ్రేణి జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. ఫస్ట్ సిరీస్‌లోనే కెప్టెన్‌గా హార్దిక్ అదరగొట్టాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ఆ జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు.

ధోనీ వారసత్వాన్ని..

ధోనీ వారసత్వాన్ని..

ఐర్లాండ్‌పై గెలిచిన టీ20 సిరీస్ ట్రోఫీని నేరుగా ఉమ్రాన్ మాలిక్ చేతికి ఇచ్చిన హార్దిక్ పాండ్య.. టీమిండియాలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగించాడు. అప్పట్లో ధోనీ కెప్టెన్‌గా ఏ సిరీస్ గెలిచినా.. ట్రోఫీని నేరుగా తీసుకెళ్లి.. ఆ సిరీస్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ప్లేయర్ చేతికి ఫస్ట్ ఇచ్చేవాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (ఒక సిరీస్ మినహా) కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్దిక్ కెప్టెన్సీని చూసిన మాజీ క్రికెటర్లు.. అతన్ని టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా అభివర్ణిస్తున్నారు.

హడలెత్తించిన హుడా..

హడలెత్తించిన హుడా..

ఐర్లాండ్‌తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న భారత్ జట్టు.. రెండో టీ20లో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో కదంతొక్కగా.. సంజూ శాంసన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరి (రెండో వికెట్‌కు 176 పరుగుల) రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టారు.

వణికించిన ఐర్లాండ్..

వణికించిన ఐర్లాండ్..

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), ఆండీ బాల్‌బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరికి తోడు హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్‌రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, June 29, 2022, 20:19 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X