ఖరీదెంతో తెలుసా?: గిన్నిస్ బుక్‌లోకి వరల్డ్‌కప్ సాధించిన ధోని బ్యాట్

Posted By:
MS Dhonis 2011 WC final bat is the most expensive bat ever

హైదరాబాద్: ఏప్రిల్ 2, 2011... సరిగ్గా ఇదే రోజున భారత దేశం సంబరాలు చేసుకుంది. సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజున ధోని నాయకత్వంలోని టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది. వాంఖడె స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో అప్పటి కెప్టెన్ ధోని తన వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌కి ప్రపంచకప్‌ని అందించాడు.

అయితే, ఫైనల్‌లో ధోని ఉపయోగించిన బ్యాట్ ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించింది. వరల్డ్ కప్‌ను నెగ్గిన మూడు నెలల తర్వాత లండన్‌లో ఒక చారిటీ డిన్నర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధోని ఉపయోగించిన బ్యాట్‌ని 2011 జులై 18న వేలానికి పెట్టారు. అది ఏకంగా 72 లక్షల రూపాయల ధరకు అమ్ముడైంది.

ఏప్రిల్ 2, 2011: 28ఏళ్ల నిరీక్షణకు తెర, ధోని సిక్స్‌తో భారత్‌కు వరల్డ్‌కప్ (వీడియో)

ముంబైకి చెందిన ఆర్కే గ్లోబల్ అనే సంస్థ ధోనీ బ్యాట్‌ను రికార్డు స్థాయి ధర చెల్లించి కొనుగోలు చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా ధోనీ ఉపయోగించిన బ్యాట్ గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కింది. వేలంలో వచ్చిన డబ్బును ధోనీ భార్య పేరిట ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఖాతాలో జమ చేశారు.

ఫైనల్లో జట్టు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో భారత్‌ విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉంది. స్టేడియంలో అభిమానుల కేరింతలు, సందడి మధ్య 49వ ఓవర్‌ మొదలైంది. తొలి బంతిని ఎదుర్కొన్న యువరాజ్ సింగిల్ తీసి ధోనీకి స్ట్రైకింగ్‌ ఇచ్చాడు.

మైఖేల్‌లో ఐపీఎల్ ఫాంటసీ క్రికెట్ ఆడండి: ఎన్నో బహుమతులు పొందండి (వీడియో)

కులశేఖర వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న ధోని దానిని భారీ సిక్సర్‌గా మలిచి భారత్‌కు వరల్డ్ కప్ అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దీంతో రెండోసారి వరల్డ్ కప్ గెలవాలన్న భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 19:34 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి