న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీకి కరోనా భయం లేదా?: బ్యాడ్మింటన్‌ ఆడుతూ.. బైక్‌పై షికారు చేస్తూ..!!

MS Dhoni reaches Ranchi after CSK call off IPL camp, spends time with playing badminton and Bike Ride
MS Dhoni Plays Badminton, Rides bike after IPL Postpone, Video Go Viral | Oneindia Telugu

రాంచి: మహమ్మారి కరోనా (కోవిడ్‌ 19) వైరస్ ధాటికి ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తితో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా ప్రభావంతో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే టోర్నీలన్నీ శనివారం రద్దయ్యాయి. శుక్రవారమే భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్న మూడు వన్డేల సిరీస్‌ను రద్దు చేసిన బీసీసీఐ.. ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)-13ను కూడా ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.

<strong>కరోనా వైర‌స్‌పై స్పందించిన రోహిత్.. ప్రజలకు ఏం చెప్పాడంటే?!!</strong>కరోనా వైర‌స్‌పై స్పందించిన రోహిత్.. ప్రజలకు ఏం చెప్పాడంటే?!!

ప్రాక్టీస్‌ రద్దు.. ఝార్కండ్‌కి మహీ

ప్రాక్టీస్‌ రద్దు.. ఝార్కండ్‌కి మహీ

ఐపీఎల్ వాయిదా, కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ప్రాక్టీస్‌ సెషన్‌కు శనివారం ముగింపు పలికింది. దీంతో ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న చెన్నై కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ సహా అంబటి రాయుడు, సురేశ్‌ రైనా, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు శనివారం చెన్నైను వీడి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో మహీ శనివారమే స్వస్థలం ఝార్కండ్‌కి వెళ్లిపోయాడు.

బ్యాడ్మింటన్‌ ఆడిన ధోనీ

కరోనా వైరస్‌ భయంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అవుతుంటే.. భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మాత్రం అందరికంటే భిన్నంగా గడుపుతున్నాడు. వైరస్‌ భయం ఉన్నా.. ఝార్కండ్‌లో మహీ ఖాళీగా కూర్చోలేదు. తాజాగా ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని ధోనీ బ్యాడ్మింటన్‌ ఆడాడు. మెన్స్ డబుల్స్ లాగా ఆ మ్యాచ్ జరిగింది. మహీ నెట్ వద్దకు వచ్చి షాట్స్ ఆడాడు. నగరంలోని జెఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బైక్‌పై షికారు:

ధోనీ బ్యాడ్మింటన్‌ ఆడడమే కాదు.. తనకెంతో ఇష్టమైన బైక్‌ రైడ్‌కు కూడా వెళ్లాడు. రాంచి వీధుల్లో హెల్మెట్‌ పెట్టుకుని బైక్‌పై షికార్లు చేసాడు. ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మహీ ఆగగా.. ఫాన్స్ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అందుకు మాజీ కెప్టెన్ కూడా సహకరించాడు. ఇక బైక్‌పై వెళుతున్న సమయంలో మహీని గుర్తు పట్టిన అభిమానులు అతన్ని చుట్టుముట్టి సెల్ఫీలు దిగారు. దీంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ధోనీకి కరోనా భయం లేదా? అని ఫాన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

వీడ్కోలు కార్యక్రమం

వీడ్కోలు కార్యక్రమం

ధోనీ రాంచీకి బయలుదేరేముందు చెన్నై జట్టు యాజమాన్యం అతనికి చిన్న వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిదంబరం స్టేడియంలో అభిమానులతో కాసేపు సరదాగా గడిపాడు. కొందరికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఫొటోలు దిగాడు. ఓ చిన్నారి అభిమానికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మహీ బారికేడ్ దగ్గరికి వెళ్లి మరీ ఓపికగా తన అభిమానులందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆపై వారితో కాసేపు ముచ్చటించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ట్విటర్‌లో పోస్టు చేసింది. 'తలా.. మళ్లీ చెన్నైకు రావాలంటే ఐపీఎల్‌ నిర్వహణపై స్పష్టత రావాల్సిందే' అని రాసుకొచ్చింది.

Story first published: Tuesday, March 17, 2020, 11:32 [IST]
Other articles published on Mar 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X