న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడి ఒత్తిడి వల్లే ధోని తప్పుకున్నాడు: వర్మ సంచలనం

బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదురి ఒత్తిడి మేరకే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడని బీహార్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిత్య వర్మ ఆరోపించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదురి ఒత్తిడి మేరకే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడని బీహార్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిత్య వర్మ ఆరోపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం...

జనవరి 4వ తేదీన నాగ్ పూర్‌లో గుజరాత్, జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ముందు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో అమితాబ్ చౌదురి ఫోన్‌లో మాట్లాడాడు. ధోని ప్యూచర్ ప్లాన్స్ గురించి అడిగి తెలుసుకోమని నాగ్‌పూర్‌కు వెళ్లమని చెప్పాడు.

భయం లేకుండా ఆడతాడు: ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై యువరాజ్

ఇదే సమయంలో జార్ఖండ్ జట్టుకు ధోని మెంటార్‌గా వ్యవహరించడం వల్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే జార్ఖండ్ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో గుజరాత్ చేతిలో జార్ఖండ్ ఓటమి పాలవడం, ఇది ఏమాత్రం ఇష్టంలేని అమితాబ్ చౌదురి కావాలనే ధోనిని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఒత్తిడి చేశాడు.

MS Dhoni quit captaincy under pressure form Amitabh Chaudhary, alleges BCA secretary Aditya Verma

ఈ నేపథ్యంలో ధోని తాను స్వయంగా ఈ నిర్ణయం తీసుకోలేదని అతనిపై సెలక్టర్లు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గుజరాత్, జార్ఖండ్ జట్ల మధ్య నాగ్‌పూర్‌లో రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని వద్దకు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు.

సెలక్టర్ల ఒత్తిడి మేరకే ధోని తప్పుకున్నాడా?: ఎమ్మెస్కే స్పందన

కెప్టెన్సీని అందుకునేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్నాడని, తాను ఇప్పటికే నిరూపించుకున్నాడని ధోనీని తప్పుకోవాల్సిందిగా నచ్చచెప్పాడని జాతీయ మీడియాలో వచ్చిన వార్తల సారాంశం. 2019లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు ధోనికి 39 సంవత్సరాలు వచ్చేస్తాయని, హడావుడిగా కోహ్లీకి కెప్టెన్సీ అప్పచెప్పడం మంచిదని వివరించాడట.

దీంతో ధోని అప్పటికప్పుడు ధోని పరిమిత ఓవర్ల కెప్టన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. దీంతో ధోని కెప్టెన్సీ వీడ్కోలు ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పందించారు.

కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని చెప్పడం విశేషం. తన కెరీర్‌లో మొత్తం 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన ధోని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం.

వన్డే ప్రపంచ కప్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాదు భారత్ తరుపున ఆరు వరల్డ్ టీ20 టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌గా ధోని ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X