న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహీ చెప్తాడు.. కోహ్లీ చేస్తాడు: కుల్దీప్ యాదవ్

cricket, ms dhoni, virat kohli, kuldeep yadav, team india, india, క్రికెట్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, టీమిండియా, ఇండియా

MS Dhoni is the General in Virat Kohli's Army, Says Kuldeep Yadav

హైదరాబాద్: తమపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు కోహ్లీని, బ్యాట్స్‌మెన్ ఎలా ఆలోచిస్తున్నారో ముందుగానే ఊహించి బంతిని ఎలా వేయాలో చెప్పే ధోనీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. భారత, శ్రీలంకల మధ్య మార్చి 6 మంగళవారం ముక్కోణపు టీ20 సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా పాల్గొన్న మీడియా సమావేశంలో పాల్గొన్న కుల్దీప్ టీమిండియా గురించి చర్చించాడు.

మంగళవారం నుంచి శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీ నుంచి కూడా ఈ మణికట్టు స్పిన్నర్‌కి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. ప్రస్తుతం ఫిటెనెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్‌కి తాను పూర్తిస్థాయిలో ఫిటెనెస్ సాధిస్తానని కుల్దీప్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ వేలంలో కుల్దీప్ యాదవ్‌ని రూ. 5.8 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

'మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ సెట్ చేయడం, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఎలా దాడి చేయాలో వ్యూహాలు రచిస్తుంటాడు. వికెట్ల వెనుక నుంచి మహేంద్రసింగ్ ధోనీ.. బౌలర్లతో కలిసి వాటిని అమలు చేసే బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే కోహ్లీ ఆర్మీకి ధోనీ జనరల్‌ లాంటివాడు. దాదాపు ప్రతి బంతికీ బౌలర్‌కు ధోనీ నుంచి సూచనలు, సలహాలు వస్తుంటాయి. కోహ్లి కూడా బౌలర్‌కి ఎక్కువ స్వేచ్ఛనిస్తుంటాడు. అందుకే నేను, చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఎదురుదాడి చేసేందుకు కూడా వెనకడుగువేయం' అని కుల్దీప్ యాదవ్ వివరించాడు.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యూహాలు రచిస్తుంటే.. వాటిని వికెట్ల వెనుక నుంచి మహేంద్రసింగ్ ధోనీ అమలు చేస్తుంటాడని ఆయన తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై ముగిసిన సుదీర్ఘ పర్యటనలో ఆరు వన్డేలాడిన కుల్దీప్ యాదవ్ 17 వికెట్లు పడగొట్టి భారత జట్టు సిరీస్‌ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అయితే.. చివరి వన్డేలో గాయపడిన కుల్దీప్.. తర్వాత జరిగిన మూడు టీ20లకీ దూరమయ్యాడు. కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా ఈరోజు రాత్రి 7 గంటలకి తొలి మ్యాచ్ జరగనుంది.

Story first published: Tuesday, March 6, 2018, 12:32 [IST]
Other articles published on Mar 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X