న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూణె గ్రౌండ్స్‌మెన్‌కు గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన ధోని

By Nageshwara Rao
MS Dhoni gets honoured by Pune Ground staff after Kings XI Punjab and Chennai Super kings match

హైదరాబాద్: రెండేళ్ల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 11వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఫలితంగా ఈ సీజన్‌లో ప్లే ఆప్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. ప్లేఆఫ్‌లో భాగంగా మంగళవారం ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.

గ్రౌండ్స్‌మెన్‌కు గిఫ్ట్‌లు ఇచ్చిన ధోని

గ్రౌండ్స్‌మెన్‌కు గిఫ్ట్‌లు ఇచ్చిన ధోని

కాగా, ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం ధోని గ్రౌండ్స్‌మెన్‌కు గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. చెన్నై జట్టు తరపున మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీఏ) గ్రౌండ్స్‌మెన్‌ ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున కానుకగా అందజేశారు. దీంతో పాటు ఐపీఎల్‌ ఆరంభంలో వారితో దిగిన ఫొటోలను ఫ్రేమ్‌ కట్టించి బహుమతిగా అందించారు.

 ఆనందం వ్యక్తం చేసిన పూణె గ్రౌండ్స్‌మెన్‌

ఆనందం వ్యక్తం చేసిన పూణె గ్రౌండ్స్‌మెన్‌

ధోనికి తమకు బహుమతులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని గ్రౌండ్స్‌మెన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఒక్క మ్యాచ్‌ని తమ సొంత మైదానం చెపాక్‌లో ఆడింది. ఆనంతరం కావేరీ జలాల వివాదం నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన సీఎస్‌కే మ్యాచ్‌లను పుణేకి తరలించిన సంగతి తెలిసిందే.

 'విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్' పేరిట రైలు

'విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్' పేరిట రైలు

సొంత మైదానం నుంచి మ్యాచ్‌లు పూణెకు తరలివెళ్లడంతో సీఎస్‌కే అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా కాస్త ఒత్తిడికి గురయ్యారు. ఇక, సీఎస్‌కే యాజమాన్యం చెన్నై మ్యాచ్‌లను వీక్షించేందుకు గాను ఏకంగా చెన్నై నుంచి పూణెకు 'విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్' పేరిట రైలు సర్వీస్ వేసేలా రైల్వే శాఖతో కూడా మాట్లాడింది.

5 మ్యాచుల్లో నాలుగింటిలో చెన్నై విజయం

5 మ్యాచుల్లో నాలుగింటిలో చెన్నై విజయం

ఇదిలా ఉంటే సీఎస్‌కే తరపున ఈ సీజన్‌లో చెన్నై మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం సిబ్బంది సీఎస్‌కే ఆటగాళ్లకు సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగించేందుకు పిచ్‌ రూపకల్పనలో జాగ్రత్త వహించింది. దీంతో ఇక్కడ జరిగిన 5 మ్యాచుల్లో నాలుగింటిలో చెన్నై విజయం సాధించింది. దీంతో చెన్నై విజయాల్లో గ్రౌండ్స్‌మెన్‌ కీలక పాత్ర పోషించారన్న సీఎస్‌కే యాజమాన్య ప్రతినిధి వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నామని.. అందుకే ధోని చేత బహుతులు అందజేసామని తెలిపారు.

Story first published: Monday, May 21, 2018, 13:43 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X