న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంతో బాధించింది: ఐపీఎల్‌లో ధోని నుంచి విలువైన సలహాలు

By Nageshwara Rao
MS Dhoni Gave Me Some Valuable Tips During IPL: Ishan Kishan

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటన కోసం సెలక్టర్లు భారత-ఏ జట్టుకు తనను ఎంపిక చేయకపోవడం ఎంతో బాధించిందని యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ చక్కటి ప్రదర్శన చేశాడు.

తనదైన శైలిలో కొన్ని మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఇషాన్ కిషన్ రెండు హాఫ్ సెంచరీలు సాధించి 275 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మే 9న జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

టీమిండియాలో చోటు దక్కించుకుంటా

టీమిండియాలో చోటు దక్కించుకుంటా

ఐపీఎల్‌కి ముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా రాణించడంతో భారత్-ఏ జట్టులోకి ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ, సెలక్టర్లు అతడికి మొండి చేయి చూపారు. తాజాగా, ఇషాన్ కిషన్ మాట్లాడుతూ భవిష్యత్‌లో టీమిండియాలో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

నన్ను బాధించింది

నన్ను బాధించింది

'భారత-ఎ జట్టులోకి ఎంపిక చేయకపోవడం నన్ను బాధించింది. ఎందుకంటే నేను విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్‌లో చాలా పరుగులు చేశాను. అందుకే తప్పకుండా సెలక్ట్ అవుతానని ఆశించాను. కానీ.. సెలక్టర్లు అలా ఆలోచించలేదు.. ఈ విషయంలో వారిని నేను ఒప్పించలేను కూడా. ఇప్పుడు నేను చేయాల్సింది ఒక్కటే.. నా ఆటకి మరింత మెరుగులు దిద్దుకోవడం' అని అన్నాడు.

ఏదో ఒకరోజు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తా

ఏదో ఒకరోజు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తా

'నాకు తెలుసు, నేను ఏదో ఒకరోజు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తా. ఆ విషయంలో నేను వంద శాతం స్పష్టతతో ఉన్నా. ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉండాలి. మీ స్థానంలో మీరు బ్యాటింగ్ చేయలేనని తర్వాత చెప్పలేరు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై ధోని భాయ్‌తో మాట్లాడాను' అని కిషన్ తెలిపాడు.

మానసికంగా ధైర్యంగా ఉండాలని ధోని సూచించాడు

మానసికంగా ధైర్యంగా ఉండాలని ధోని సూచించాడు

'మెరుగ్గా ఆడినా.. ఫెయిల్ అయినా.. మానసికంగా ధైర్యంగా ఉండాలని, ఒక మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసిన తరువాత రిలాక్స్ కాకూడదని, అదే తీవ్రతను తరువాత కూడా కొనసాగించాలని ధోని సూచించాడు' ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఇషాన్ కిషన్ కూడా ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ కావడం విశేషం.

Story first published: Tuesday, May 29, 2018, 19:39 [IST]
Other articles published on May 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X