వెన్నునొప్పితో ధోని బ్యాటింగ్ చేయలేకపోయిన వేళ చెన్నై ఓటమి

Posted By:
MS Dhoni, battling back pain, fails to win KXIP encounter but CSK fans arent complaining

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంత మాత్రం కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. సీజన్ ఆరంభం నుంచీ ఆ జట్టు ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కావేరీ జల వివాదం ఆందోళన కారణంగా సొంత మైదానమైన చెపాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు దూరమైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత జట్టులోని కీలక ఆటగాళ్లు సురేశ్‌ రైనా, కేదార్‌ జాదవ్‌లు గాయాలతో టోర్నీకి దూరంకావడం, తండ్రి మరణంతో దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి స్వదేశానికి వెళ్లినపోవడంతో చెన్నై జట్టుని కోలుకోకుండా చేశాయి. తాజాగా, చెన్నై కెప్టెన్ ధోని తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటం అభిమానులను కలవరపెడుతోంది.

4 పరుగుల తేడాతో చెన్నై ఓటమి

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. చెన్నై ఇన్నింగ్స్‌ మధ్యలో ధోని ఫిజియోథెరపీ చేయించుకోని దూకుడుగా ఆడినప్పటికీ, చివరికి 4 పరుగుల తేడాతో చెన్నై ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

వెన్నునొప్పి నన్ను బాధించింది

వెన్నునొప్పి నన్ను బాధించింది

మ్యాచ్ ముగిసిన తర్వాత తన వెన్నునొప్పిపై ధోని మాట్లాడుతూ 'అవును. వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తారు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్‌కు కొంత గ్యాప్‌ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా' అని అన్నాడు.

ధోని వెన్నునొప్పితో తాళలకే ఫిజియోతో చికిత్స

ధోని వెన్నునొప్పితో తాళలకే ఫిజియోతో చికిత్స

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరోసారి యువరాజ్-ధోనిల మధ్య స్నేహాబంధం బయటపడింది. ధోని వెన్నునొప్పితో తాళలకే ఫిజియోతో చికిత్స చేయించుకున్న సమయంలో పంజాబ్ ఆటగాడు యువరాజ్ సింగ్ ధోని తలపై నిమిరాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరికి పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిమానులు మునుపటి ధోనీని వీక్షించారు.

ధోనికి అద్భుతంగా బంతులేసిన మోహిత్ శర్మ

ధోనికి అద్భుతంగా బంతులేసిన మోహిత్ శర్మ

చెన్నై జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు బరిలోకి దిగిన ధోని 44 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 79 పరుగులతో నాటౌట్‌ నిలిచాడు. ధోని ఇన్నింగ్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. మోహిత్ శర్మ అద్భుతంగా బంతులేశాడు. ధోనికి అందకుండా బంతులేసి 11 పరుగులే ఇవ్వడంతో చెన్నై 193/5కే పరిమితమైంది.

ముజీబ్‌పై ధోని ప్రసంశల వర్షం

ఇదిలా ఉంటే, మ్యాచ్‌ తర్వాత కామెంటేంటర్లతో మాటల సందర్భంగా ధోని పంజాబ్‌ యువ స్పిన్నర్, అఫ్ఘాన్ బౌలర్ ముజీబ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మిడిల్‌ ఓవర్స్‌లో ముజీబ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, అతని బంతుల్ని ఎదుర్కోవవడానికి కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. చెన్నై తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 12:30 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి