న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జయసూర్య రికార్డు బద్దలు: రోహిత్ శర్మ 29వ సెంచరీతో మూడో వన్డేలో నమోదైన రికార్డులివే!

Most ODI Centuries: Rohit Sharma Scores His 29th ODI Hundred, Overtakes Sanath Jayasuriya To Fourth Spot on The List

హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆదివారం చిన్నస్వామి స్డేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరిస్ విజేతను నిర్ణయించే వన్డేలో కోహ్లీసేన విజయం సాధించండంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో స్మిత్‌ (131) సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 286 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రోహిత్‌శర్మ (119) సెంచరీతో చెలరేగడంతో పాటు కోహ్లీ (89) రాణించడంతో 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యోయి. అవెంటో ఒక్కసారి చూద్దాం...

<strong>రిస్క్‌ చేస్తానని కోహ్లీకి చెప్పా.. సెంచరీ సాధించా: రోహిత్</strong>రిస్క్‌ చేస్తానని కోహ్లీకి చెప్పా.. సెంచరీ సాధించా: రోహిత్

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్‌శర్మ (29) అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... విరాట్ కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో ఉన్న లంక దిగ్గజ క్రికెటర్ సనత్‌ జయసూర్య(28)ను రోహిత్ శర్ అధిగమించాడు.

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ (11,208) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (11,207) పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 89 పరుగులతో రాణించడంతో ధోనిని అధిగమించాడు. ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో ఈ పరుగులు సాధించగా కోహ్లీ 199 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.

అత్యధిక ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'లు

అత్యధిక ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'లు

వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌లు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(8) మూడో స్థానంలో నిలిచాడు. వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌, సఫారీ మాజీ పేసర్ షాన్‌ పొలాక్‌ సరసన కోహ్లీ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (14) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, జయసూర్య (11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

డెత్‌ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా షమి

డెత్‌ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా షమి

గతేడాది జనవరి నుంచి డెత్‌ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ(19) అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ (22) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని

అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని

వన్డేల్లో అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ (217) నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్‌ (208) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్‌ శర్మ తర్వాత సౌరవ్ గంగూలీ (228), సచిన్ టెండూల్కర్ (235), బ్రియాన్ లారా (239)లు ఉన్నారు.

Story first published: Monday, January 20, 2020, 12:32 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X