న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాను కట్టడి చేయాలనే బౌన్సీ పిచ్ తయారుచేస్తున్నారా?

More excited than nervous looking at lively pitches, says Virat Kohli ahead of Perth Test

పెర్త్: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా ఎలాగైనా భారత జట్టును ఓడించాలనే కసి మీద ఉంది. ఈ క్రమంలోనే రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదల కనబరుస్తున్న ఆసీస్ బౌన్సీ పిచ్‌తో కోహ్లిసేనను భయపెట్టాలని చూస్తోంది. ప్రపంచంలోని బౌన్సీ వికెట్లలో ఒకటిగా పేరుగాంచిన పెర్త్‌ రెండో టెస్టు మ్యాచ్‌కు వేదిక కానుండటంతో భారత్‌పై బౌన్సర్లతో ఎక్కుపెట్టాలని చూస్తోంది. ఈ కారణంతోనే పిచ్‌పై పచ్చిక చాలా ఎక్కువగా ఉన్న పిచ్‌ను క్యూరేటర్ బ్రెట్ సిప్‌థోర్ప్ తయారు చేశాడు. శుక్రవారం మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం నాటికల్లా పిచ్‌ను తయారుచేశాడు.

టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా మారనున్న పిచ్

టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా మారనున్న పిచ్

తొలి టెస్టు జరుగుతుండగానే అధికారుల నుంచి సాధ్యమైనంత వరకు ఫాస్ట్, బౌన్సీ పిచ్ తయారు చేయాలని తమకు ఆదేశాలు వచ్చినట్లు సిప్‌థోర్ప్ చెప్పాడు. మామూలుగానే ఆస్ట్రేలియా పిచ్‌లలో పెర్త్ బౌన్స్‌కు పెట్టింది పేరు. గతంలో ఇక్కడ ఆడిన అన్ని విదేశీ జట్లు బౌన్స్‌కు బెంబేలెత్తేశాయి. ఈసారి దానిని మరింత బౌన్స్‌కు అనుకూలంగా మార్చడంతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా మారనుంది. తప్పేలా కనిపించడం లేదు. గతంలో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా బౌన్స్ చాలా ఎక్కువగా ఉన్న మైదానాన్ని తయారు చేశామని, ఈసారి కూడా అలాంటిదే సిద్ధం చేస్తున్నామని సిప్‌థోర్ప్ వ్యాఖ్యానించాడు.

మండుతున్న ఎండలను కూడా పరిగణనలోకి

ఆ మ్యాచ్‌లో పిచ్‌కు ప్లేయర్స్ నుంచి వందకు వంద మార్క్‌లు పడ్డాయని అతను తెలిపాడు. ఇప్పుడు అటు ఆస్ట్రేలియా, ఇటు టీమిండియాలో మంచి పేస్ బౌలర్లు ఉన్నారు. దీంతో ఈ వికెట్ వాళ్లను ఊరిస్తోంది. టాస్ గెలిచిన టీమ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మండుతున్న ఎండలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని క్యూరేటర్ అన్నాడు. 38 డిగ్రీల ఎండ వేడిమిలో మొదట బౌలింగ్ చేస్తే అలసిపోయే అవకాశాలు ఉంటాయని అతను చెబుతున్నాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 లీడ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

కచ్చితంగా ఆ జట్టు పుంజుకునే అవకాశం

సొంతగడ్డపై ఆస్ట్రేలియా బలమైన జట్టు. దీనికి తోడు.. బౌలర్లకి అతిగా అనుకూలించే పెర్త్ వికెట్‌పై ఆడబోతుండటం కచ్చితంగా ఆ జట్టు పుంజుకునే అవకాశం ఉంది. అయితే బౌన్సింగ్ పిచ్ కావడంతో టీమిండియాకి కూడా విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఆ ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతాం. టీమిండియా కూడా బలమైన బౌలింగ్ ఎటాక్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం జట్టులో నలుగురు లేదా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

పెర్త్ టెస్టుకి భారత్ జట్టు:

విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్

Story first published: Thursday, December 13, 2018, 17:14 [IST]
Other articles published on Dec 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X