న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇదే ఫామ్‌ కొనసాగిస్తే... సచిన్ 100 సెంచరీల రికార్డుని కోహ్లీ బద్దలు కొడతాడు'

 Mohammed Azharuddin backs Virat Kohli to equal Sachin Tendulkars 100 hundreds record, If he stays fit & maintains his fitness

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 100 అంతర్జాతీయ సెంచరీలను సాధిస్తాడని టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ తక్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అజహరుద్దీన్‌ మాట్లాడుతూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఇదే ఫామ్‌ కొనసాగిస్తే కోహ్లీ వంద సెంచరీలు కొట్టడం ఖాయమని అన్నాడు.

<strong>హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు బేషరతు క్షమాపణ చెప్పారు కానీ </strong>హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు బేషరతు క్షమాపణ చెప్పారు కానీ

అడిలైడ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో కోహ్లీకి ఇది 39వ సెంచరీ. టెస్టులు, వన్డేలు కలిపి ఇప్పటివరకు 64 సెంచరీలు సాధించాడు. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌(100), పాంటింగ్‌(71) తర్వాత కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

అజహరుద్దీన్ మాట్లాడుతూ

అజహరుద్దీన్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో అజహరుద్దీన్ మాట్లాడుతూ "విరాట్‌ కోహ్లీ నిలకడగా బాగా ఆడుతున్నాడు. ఫిట్‌గా ఉంటే 100 సెంచరీల మార్క్‌ను కచ్చితంగా చేరుకుంటాడు. కోహ్లీ గొప్ప ఆటగాడు. అతడు సెంచరీ చేసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే టీమిండియా ఓడిపోయింది" అని అజహరుద్దీన్‌ పేర్కొన్నాడు.

జట్టు విజయంలో ధోని కీలకపాత్ర

జట్టు విజయంలో ధోని కీలకపాత్ర

అడిలైడ్ వన్డేలో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ కెప్టెన్‌ ధోనిపై కూడా అజహరుద్దీన్ ప్రశంసలు కురిపించాడు. "ధోని బాగా బ్యాటింగ్‌ చేశాడg, చివరివరకు వికెట్‌ కాపాడుకుని విన్నింగ్‌ షాట్‌ కొట్టడం అతడికే చెల్లింది. దినేశ్‌ కూడా బాగా బ్యాటింగ్‌ చేశాడు. మొత్తంగా టీమిండియా ప్రదర్శన బాగుంది" అని అజహరుద్దీన్‌ అన్నాడు.

టీమిండియా సమిష్టి ప్రదర్శన

టీమిండియా సమిష్టి ప్రదర్శన

ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. రెండో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్‌ టచ్‌తో విజయం భారత్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్‌ మార్ష్‌ (131) సెంచరీ, మాక్స్‌వెల్‌(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.

వన్డేల్లో కోహ్లీ 39వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీ 39వ సెంచరీ

అనంతరం ఆస్ట్రేలియా నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ (104; 112 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో రాణించగా, ధోని(55 నాటౌట్‌) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 18న జరగనుంది.

Story first published: Wednesday, January 16, 2019, 12:39 [IST]
Other articles published on Jan 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X