న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందరూ నన్ను సౌరవ్ గంగూలీ అని పిలిచేవాళ్లు: బంగ్లా క్రికెటర్

Mohammad Saifuddin said People used to call me Sourav Ganguly of Feni for following his playing style

ఢాకా: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీని తన చిన్నతనం నుంచి అనుసరిచేవాడిని అని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ వెల్లడించాడు. అప్పట్లో గంగూలీ తన దూకుడు నాయకత్వ విధానం, ఆకట్టుకునే బ్యాటింగ్ ప్రదర్శనతో 'యూత్ ఐకాన్'గా ఉండేవాడు. జాతీయ జట్టులోకి ప్రవేశించాలని కలలు కనే చాలా మంది యువ ఆటగాళ్లకు.. ముఖ్యంగా ఉపఖండంలోని వారు దాదాను అమితంగా ఇష్టపడేవారు.

త్వరలోనే స్టేడియంలో అడుగుపెట్టనున్న టీమిండియా క్రికెటర్లు!!త్వరలోనే స్టేడియంలో అడుగుపెట్టనున్న టీమిండియా క్రికెటర్లు!!

కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా విదేశీ టెస్టుల్లో భారత క్రికెట్ ముఖాన్ని పూర్తిగా మార్చాడు. విదేశీ గడ్డపై అత్యుత్తమ భారత కెప్టెన్‌గా నిలిచాడు. గంగూలీ 28 టెస్టుల్లో 11 విజయాలను టీమిండియాకు అందించాడు. దాదాకు ఎందరో అభిమానులు ఉండేవారు. అందులో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ కూడా ఒకడు. ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసే సైఫుద్దీన్.. కుడి చేత్తో పేస్ బౌలింగ్ చేస్తాడు. దీంతో చిన్నతనంలో తమ ప్రాంతంలో తనని సౌరవ్ గంగూలీ అని పిలిచేవారని అతడు చెప్పుకొచ్చాడు.

క్రిక్ ఫ్రెంజీ ఫేస్‌బుక్ లైవ్ చాట్ సెషన్‌లో మహ్మద్ సైఫుద్దీన్ మాట్లాడుతూ... 'ఫెనీ భారత బార్డర్‌కి అత్యంత చేరువలో ఉండేది. నా చిన్నతనంలో టీవీ యాంటీనాను అటూ ఇటూ కదిలిస్తే.. బీటీవీతో పాటు మరో జాతీయ ఛానెల్‌ని చూడా చేసే అవకాశం ఉండేది. సచిన్ టెండూల్కర్‌తో కలిసి సౌరవ్ గంగూలీ ఓపెనింగ్ చేసే సమయంలో.. దాదా బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేసేవాడు. బౌలింగ్‌లో కూడా గంగూలీ మంచి సహకారం అందించాడు' అని పేర్కొన్నాడు.

'ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నేను మా గ్రామంలో ఆడే సమయంలో అందరూ నన్ను సౌరవ్ గంగూలీ అని పిలిచేవారు. ఎందుకంటే.. నేను కూడా ఎడమ చేత్తో బ్యాటింగ్, కుడి చేత్తో బౌలింగ్ చేసేవాడిని. అప్పటి నుంచి నాకు గంగూలీ అంటే అభిమానం ఏర్పడింది. గంగూలీ ఆటలను చూస్తూ పెరిగా. దాదా ఆట శైలిని కాపీ చేసేవాడిని. ఇప్పుడున్న ఆటగాళ్లలో నేను బెన్ స్టోక్స్, కోరే ఆండర్‌సన్‌ని అనుసరిస్తాను' అని సైఫుద్దీన్ ఫేస్‌బుక్ లైవ్‌లో తెలిపాడు. సైఫుద్దీన్ బంగ్లా తరఫున 22 వన్డేలు, 15 టీ20లు ఆడాడు.

Story first published: Tuesday, June 2, 2020, 17:03 [IST]
Other articles published on Jun 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X