న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లాహోర్లో ఫుడ్ విషయంలో నిరాశకు గురయ్యా.. సిరీస్ విజయానంతరం మొయిన్ అలీ కామెంట్లు

Moeen Ali Intresting comments about Food in Lahore During England Tour of Pakistan

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-3 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయానంతరం ఇంగ్లాండ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ మొయిన్ అలీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ దేశం అందించిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఆలీ ఈ సందర్భంగా కరాచీ, లాహోర్‌లో తమకు అందించిన ఫుడ్ విషయంలో సరదా కామెంట్లు చేశాడు. లాహోర్లో ఫుడ్ విషయంలో కాస్త నిరాశకు గురయ్యానని, కరాచీలో మాత్రం ఫుడ్ అదిరిపోయిందని అలీ చెప్పాడు. ఈ ఏడు టీ20 మ్యాచ్‌లు కేవలం రెండు వేదికల్లోనే ఆడటం గమనార్హం. మొదటి నాలుగు మ్యాచ్‌లు కరాచీలో జరగగా.. చివరి మూడు మ్యాచ్‌లు లాహోర్ వేదికగా జరిగాయి. ఇక 17ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ జట్టు.. పాకిస్థాన్లో అడుగుపెట్టింది.

 డిఫెరెంట్ లైనప్‌ను ప్రయోగిస్తూ..

డిఫెరెంట్ లైనప్‌ను ప్రయోగిస్తూ..

' పాకిస్థాన్ భద్రత అత్యద్భుతంగా ఉంది. మేము ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఆహారపరంగా లాహోర్‌లో నేను కొంచెం నిరాశకు గురయ్యాను. కరాచీలో ఫుడ్ చాలా బాగుంది' అని మొయిన్ చెప్పాడు. మొయిన్ ఇంగ్లాండ్‌ టీంను ఈ సిరీస్‌లో చాలా బాగా నడిపించాడు. టీ20 ప్రపంచ‌కప్ 2022కి ముందు జట్టు బలాబలాలు గుర్తించడానికి క్రమం తప్పకుండా జట్టులో మార్పులు చేర్పులు చేస్తూ.. డిఫెరెంట్ లైనప్‌ను ప్రయోగిస్తూ మొయిన్ కొత్తదనాన్ని ప్రదర్శించాడు.

బాబర్ రెండు క్యాచ్‌లు మిస్ చేయడంతో

బాబర్ రెండు క్యాచ్‌లు మిస్ చేయడంతో

అదే సమయంలో జట్టు మేనేజ్‌మెంట్ మొత్తం ఏడు గేమ్‌లకు రెగ్యులర్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చింది. కాఫ్ గాయంతో బట్లర్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌కు మాత్రం బట్లర్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఇకపోతే చివరిదైన ఏడో టీ20 మ్యాచ్ డిసైడర్‌గా జరిగింది. చివరి టీ20లో ఇంగ్లాండ్ 67పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాకిస్తాన్‌ ఛేదనలో పూర్తిగా విఫలమైంది. స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. కెప్టెన్ బాబర్ ఆజామ్ రెండు కీలక క్యాచ్‌లు డ్రాప్ చేయడం జట్టును దెబ్బతీసింది.

డేవిడ్ మలాన్, హ్యారీ బ్రూక్ చెలరేగడంతో

డేవిడ్ మలాన్, హ్యారీ బ్రూక్ చెలరేగడంతో

తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయగా.. డేవిడ్ మలాన్ (78*), హ్యారీ బ్రూక్ (46పరుగులు) రాణించడంతో 3వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో బాబర్, మహ్మద్ రిజ్వాన్‌ త్వరగా ఔట్ కావడంతో పాకిస్థాన్ మిడిలార్డర్ ఎప్పటిలాగే చేతులెత్తేశారు. షాన్ మసూద్ (56 పరుగులు ) రాణించినప్పటికీ.. మిగతవాళ్లు జోరు కనబర్చలేకపోయారు. దీంతో పాక్ 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 142కే పరిమితమైంది.

Story first published: Monday, October 3, 2022, 16:46 [IST]
Other articles published on Oct 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X