న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20 గెలవాలంటే టీమిండియాలో మార్పులు తప్పవా?

Mistakes India need to correct to win the 2nd T20I against Australia

మెల్‌బౌర్న్: బలహీనంగా కనిపించిన ఆసీస్ జట్టు భారత్‌పై జులుం విదిల్చింది. భారత బౌలర్లు కట్టడి చేస్తున్నా.. సొంతగడ్డపై చెలరేగి అలవోకగా ఆడేసింది. దానికి తోడుగా వర్షం రావడంతో కంగారూలకు బలం చేకూరినట్లు అయింది. అయినా ఆ టార్గెట్ చేధించడం టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు కష్టమైన పనేం కాదు. కాస్త తడబడ్డారు. భారీ అంచనాలు పెట్టుకున్న రోహిత్, కోహ్లీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమై ఇన్నింగ్స్ చాలించారు. ఈ క్రమంలో రెండో టీ20లో గెలిస్తేనే సిరీస్ దక్కించుగోలం.

దీంతో మళ్లీ కోహ్లీ జట్టులో మార్పులు చేస్తాడా.. జట్టులో బలహీనంగా ఉన్నామా అని విశ్లేషిస్తే..

ఫీల్డింగ్‌లో కోహ్లీ సైతం పొరబాట్లు

ఫీల్డింగ్‌లో కోహ్లీ సైతం పొరబాట్లు

‘మేం ఇంగ్లాండ్‌లో ఘోర తప్పిదాలు చేశాం. అందుకే ఓడాం. ఆసీస్‌లో ఆ పొరపాట్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తాం' అని ఈ పర్యటనకు బయల్దేరే ముందు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కానీ, ఫీల్డింగ్‌లోనూ చురుకుగా కనిపించే విరాట్‌ సైతం ఫించ్‌ క్యాచ్‌ను జట్టుకు కష్టం తెచ్చిపెట్టాడు. కీలక సమయంలో ఖలీల్‌ అహ్మద్‌.. స్టొయినిస్‌ క్యాచ్‌ వదిలేశాడు. మాక్స్‌వెల్‌ రనౌట్‌ను మిస్‌ చేశారు. ఫీల్డింగ్‌ పొరపాట్లతో అదనపు పరుగులూ వచ్చాయి. డక్‌వర్త్‌ లూయిస్‌ వల్ల అదనంగా 16 పరుగులు లక్ష్యానికి జతచేశారు.

రిషభ్‌ ఒత్తిడికి లోనై రివర్స్‌హిట్‌

రిషభ్‌ ఒత్తిడికి లోనై రివర్స్‌హిట్‌

ఛేదనలో ఒత్తిడికి లోనైన రిషభ్‌ ఆడకూడని రివర్స్‌హిట్‌తో ఔటయ్యాడు. అప్పటి వరకూ గెలుపు ఆశలన్నీ ఆవిరైపోయాయి. మ్యాచ్‌ కీలక మలుపు తిరిగింది. బ్రిస్బేన్‌ తరహాలోనే మెల్‌బోర్న్‌లోనూ వర్షం పడే అవకాశాలున్నాయి. శిఖర్‌ ఫామ్‌లో ఉండటం, బుమ్రా, కుల్‌దీప్‌ చక్కగా బంతులు వేయడం కలిసొచ్చే అంశాలు. తొలి టీ20లో ఇబ్బందిగా కదిలిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి అందుకుంటే మ్యాచ్‌లో చక్కని ఫలితాలు రాబట్టవచ్చు. బ్యాటింగ్ అవకాశం వస్తే.. దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌ మ్యాచ్‌ గెలిచేవరకు క్రీజులో నిలవాల్సిందే.

మెల్‌బోర్న్‌ సైతం గబ్బా స్వభావంతోనే

మెల్‌బోర్న్‌ సైతం గబ్బా స్వభావంతోనే

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీసేన మార్పులు చేసే అవకాశముంది. పచ్చిక అధికంగా ఉన్న పిచ్‌పై ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్య 4 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చాడు. వికెటేమీ తీయలేదు. అతడి బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ 6 సిక్సర్లు బాదేశారు. మెల్‌బోర్న్‌ పిచ్‌ సైతం గబ్బా స్వభావంతోనే ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాండ్య స్థానంలో మార్పు చేస్తే చాహల్‌కు అవకాశం కల్పించొచ్చు.

రాహుల్ బదులు మనీశ్ పాండేను..

రాహుల్ బదులు మనీశ్ పాండేను..

మూడో ఓపెనర్‌గా జట్టులో మెరుస్తున్న కేఎల్‌ రాహుల్‌ ఫేలవ ఫామ్‌ పెద్ద సమస్యగా మారింది. ఇంగ్లాండ్‌లో తొలి టీ20లో సెంచరీ తర్వాత ఆడిన ఏ మ్యాచ్‌లోనూ 30 పరుగులు దాటలేదు. ఆడిందీ 6 మ్యాచ్‌లే. పదేపదే రిజర్వు బెంచీపై కూర్చోబెట్టడం అతని ప్రతిభను దెబ్బతీసినట్టు కనిపిస్తోంది. తొలి టీ20లో అతడిని మూడో స్థానంలో పంపించాలని కోహ్లీ చేసిన నిర్ణయం ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఇక రెండో టీ20కి రాహుల్‌ బదులు మనీశ్‌ పాండేను తీసుకొనే అవకాశాలున్నాయి.

Story first published: Thursday, November 22, 2018, 17:15 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X