న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని స్లెడ్జింగ్‌ చేయడానికి ఆసీస్ క్రికెటర్లు భయపడుతున్నారు: క్లార్క్

Michael Clarke says Australian Cricketers Are Scared To Sledge Virat Kohli To Protect IPL Deals

సిడ్నీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఒక్క కోహ్లీనే కాదు మిగతా భారత ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేసే పరిస్థితిలో ఆసీస్ ఆటగాళ్లు లేరు, దానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని క్లార్క్ పేర్కొన్నాడు. స్లెడ్జింగ్ తగ్గించుకోవడం ద్వారా మిలియన్ డాలర్ల ఐపీఎల్ ఒప్పందాలను ఆసీస్ ఆటగాళ్లు రక్షించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు, అయితే ఇది క్రికెట్ ఆస్ట్రేలియాకు అంత మంచి కాదన్నాడు.

<strong>రవిశాస్త్రి, హర్ష భోగ్లే కాదు.. కోహ్లీ ఫేవరేట్ కామెంటేటర్ ఎవరంటే?</strong>రవిశాస్త్రి, హర్ష భోగ్లే కాదు.. కోహ్లీ ఫేవరేట్ కామెంటేటర్ ఎవరంటే?

స్లెడ్జింగ్‌ చేయడానికి భయపడుతున్నారు:

స్లెడ్జింగ్‌ చేయడానికి భయపడుతున్నారు:

తాజాగా బిగ్ స్పోర్ట్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ... 'అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఐపీఎల్ టోర్నీలోనూ భారత్ బలమేంటో అందరికీ తెలుసు. ఆసీస్ ఆటగాళ్లే కాదు దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు టీమిండియాకు వ్యతిరేకంగా ఉండరు. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్‌కి దిగితే.. తమ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు' అని క్లార్క్ అన్నాడు.

సాహసం ఎవరూ చేయడం లేదు:

సాహసం ఎవరూ చేయడం లేదు:

'కేవలం ఆరు వారాల వ్యవధిలోనే రూ. కోట్లు సంపాదించే అవకాశం ఆటగాళ్లకు ఐపీఎల్‌‌లో ఉంది. ఆలాంటి మంచి అవకాశాన్ని ఎవరూ వదులుకోరు. అందుకే అనవసరంగా నోరు పారేసుకుని కోట్లు పోగొట్టుకునే సాహసం ఎవరూ చేయడం లేదు. మునుపటితో పోలిస్తే.. ఆస్ట్రేలియా క్రికెటర్ల వ్యవహార శైలి కూడా మారింది' అని మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. కొందరి ప్లేయర్లు తమ జట్టులో ఆడాలని ఐపీఎల్ ప్రాంచైజీలు కూడా కోరుకుంటుంన్నాయన్నాడు.

స్నేహపూర్వకంగా ఉండేందుకు:

స్నేహపూర్వకంగా ఉండేందుకు:

నేను కోహ్లీని స్లెడ్జ్ చేయబోను, అతని జట్టులో ఆడాలనుకుంటున్నా, ఆరు వారాలలో వచ్చే కోట్లను పోగొట్టుకోను అనే భావనలో ఆటగాళ్లు ఉన్నారని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'కోహ్లీ కెప్టెన్సీ వహిస్తున్న బెంగళూరు జట్టులో ఉండాలని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆశిస్తున్నారు. ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ తమని కొనుగోలు చేయాలని వారు కోరుకుంటూ.. కోహ్లీ తమ ఫేరుని రెఫర్ చేయాలని ఆరాటపడుతున్నారు. అందుకే కోహ్లీపై స్లెడ్జింగ్‌కి దిగకుండా అతనితో స్నేహపూర్వకంగా ఉండేందుకు చాలా మంది ఆసీస్ క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారు' అని మాజీ కెప్టెన్ అన్నాడు.

కమిన్స్‌కి జాక్‌పాట్:

కమిన్స్‌కి జాక్‌పాట్:

ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఆస్ట్రేలియాకి చెందిన ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌కి రికార్డు స్థాయిలో ధర పలికింది. రూ. 15.5 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ అతన్ని కొనుగోలు చేసింది. మాక్స్‌వెల్‌(రూ. 10.75), అరోన్ ఫించ్‌ (రూ.2 కోట్లు), నాథన్ కౌల్టర్ నైల్‌(రూ. 8 కోట్లు), క్రిస్‌లిన్ (రూ. 2 కోట్లు)లకు భారీ ధరే పలికింది. ఇక డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్ కొనసాగుతున్నాడు.

టోర్నీపై సందేహాలు:

టోర్నీపై సందేహాలు:

షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదాపడింది. అయితే దేశంలో ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 114మంది మరణించగా.. 3981 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ జగడంపై సందేహాలు నెలకొన్నాయి.

Story first published: Tuesday, April 7, 2020, 13:25 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X