ఏడేళ్ల వివాహ బంధానికి బ్రేక్.. మాజీ కెప్టెన్‌ సంచలన నిర్ణయం!!

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. మైకెల్ క్లార్క్ తన భార్య కైలీతో త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్టుగా బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. కొంతకాలం ఇద్దరం విడివిడిగా జీవించిన తర్వాత స్నేహపూర్వకంగా విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని క్లార్క్‌, కైలీ దంపతులు వెల్లడించారు.

నీషమ్, రాహుల్ గొడవ.. అదిరే పంచ్ ఇచ్చిన ఐసీసీ!!

2012లో వివాహం

2012లో వివాహం

2012లో మాజీ మోడల్‌, టీవీ ప్రజెంటర్‌ కైలీతో క్లార్క్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. క్లార్క్‌, కైలీ దంపతులకు ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉంది. గత ఏడాది నుంచి కైలీకి దూరంగా ఉంటున్న క్లార్క్.. ఇటీవల కూతురు కెల్సే 4వ పుట్టిన రోజు వేడుకల్లో భార్యతో సరదాగా గడిపాడు. గత కొంతకాలంగా క్లార్క్‌ భార్యతో గొడవపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గతేడాది గొడవలు అధికం కావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది.

కుమార్తెను చూసుకోవడానికి

కుమార్తెను చూసుకోవడానికి

కూతురు 4వ పుట్టినరోజు వేడుకలు, క్లార్క్ తల్లిదండ్రుల 50వ పెళ్లిరోజు వేడుకలలో క్లార్క్‌, కైలీ దంపతులు సఖ్యతగానే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. ఇంతలోనే ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ తమ కుమార్తెను ఇద్దరం చూసుకోవడానికి కట్టుబడి ఈ నిర్ణయానికి వచ్చామని క్లార్క్‌ దంపతులు పేర్కొన్నారు. తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేశారు.

 కోర్టు వెలుపలే విడాకులు

కోర్టు వెలుపలే విడాకులు

క్లార్క్, కైలీ దంపతులు కోర్టు వెలుపలే తమ విడాకుల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. 5 నెలల కిత్రం క్లార్క్‌ దంపతులు విడిపోయారనే ప్రచారం జరిగింది. అయితే.. కైలీ ఆ వార్తలను ఖండించారు. తమ బంధం బలంగా ఉందన్నారు. కైలీతో పెళ్లికి ముందు మోడల్‌ లారా బింగిల్‌తో క్లార్క్‌కు నిశ్చితార్థం జరిగింది. కానీ.. ఏవో కారణాలతో వారిద్దరు 2010లో విడిపోయారు. అనంతరం అవతార్‌ హీరో సామ్ వర్తింగ్టన్‌ను బింగిల్‌ 2014లో వివాహం చేసుకుంది.

పరస్పర అంగీకారంతో విడిపోయాం

పరస్పర అంగీకారంతో విడిపోయాం

విడాకులపై క్లార్క్ స్పందించాడు. 'కైలీ, నేను ఒకరినొకరు గౌరవించుకుంటున్నాం. పరస్పర అంగీకారంతో విడిపోయి పాప భవిష్యత్ గురించి బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇన్నిరోజులు మాకు అండగా నిలిచిన కుటుంబ, సన్నిహితులకు కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచగలిగారు' అని తెలిపాడు.

 2015లో క్రికెట్‌ గుడ్‌ బై

2015లో క్రికెట్‌ గుడ్‌ బై

2011లో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ నుంచి క్లార్క్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అనతికాలంలోనే ఆసీస్‌ క్రికెట్‌ జట్టును నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించి పాంటింగ్‌కు సరైన వారసుడిగా పేరు సంపాదించాడు. 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ అనంతరం క్లార్క్‌ క్రికెట్‌ గుడ్‌ బై చెప్పాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, February 13, 2020, 11:12 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X