న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI: 'నేను ఇప్పటివరకు చూడని బెస్ట్‌ టీ20 మ్యాచ్ ఇదే.. పొలార్డ్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు'

MI vs CSK: Rohit Sharma says I have never seen a chase like that before, One of the best T20 game
IPL 2021: CSK vs MI బెస్ట్‌ టీ20 మ్యాచుల్లో ఒకటి.. Rohit In Awe Of Kieron Pollard || Oneindia Telugu

ఢిల్లీ: చివరి బంతి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. ఏకంగా 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ముంబై రికార్డు సృష్టించింది. స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్ పొలార్డ్ (87 నాటౌట్; 34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సృష్టించిన విధ్వంసానికి చెన్నై తలొంచింది. బౌలర్లపై ఏ మాత్రం దయ లేకుండా భారీ సిక్సులు, బౌండరీలు బాదుతూ తన జట్టుకు ఊహించని విజయాన్నందించాడు. ముంబై 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.

 CSK vs MI: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. ఒకే ఒక్క క్యాచ్ చెన్నై కొంప ముంచింది!! CSK vs MI: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. ఒకే ఒక్క క్యాచ్ చెన్నై కొంప ముంచింది!!

బెస్ట్‌ టీ20 మ్యాచుల్లో ఒకటి:

బెస్ట్‌ టీ20 మ్యాచుల్లో ఒకటి:

మ్యాచ్‌ తర్వాత ప్రెజంటేషన్‌ కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఇది తాను అంతకుముందు ఎన్నడూ చూడని ఒక బెస్ట్‌ గేమ్‌గా అభివర్ణించాడు. 'నేను ప్రాతినిథ్యం వహించిన సందర్భాలను చూస్తే.. ఈ తరహా గేమ్‌ను ఎప్పుడూ చూడలేదు. ఇది బెస్ట్‌ టీ20 మ్యాచుల్లో ఒకటి. కీరన్ పొలార్డ్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ను డగౌట్‌ నుంచి చూశాను. అందరూ బాగా ఆడారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఈ లక్ష్యాన్ని ఛేజ్‌ చేయడానికి బరిలోకి దిగేటప్పుడు ఒకటే అనుకున్నాం. సానుకూల ధోరణిలో ఆడాలి.. అదే సమయంలో 20 ఓవర్లు ఆడాలనే అనుకున్నాం. అలానే మాకు మంచి ఆరంభం వచ్చింది' అని రోహిత్ అన్నాడు.

కృనాల్‌ మంచి బ్యాటర్:

కృనాల్‌ మంచి బ్యాటర్:

'ఈ పిచ్ మంచి బ్యాటింగ్‌ ట్రాక్‌ ఇది. బౌండరీ సరిహద్దు కూడా చిన్నదే. విరామ సమయాల్లో ఇదే చర్చించాం. చివరివరకు ఆడితే మ్యాచ్ గెలవొచ్చు అనుకున్నాం. మా జట్టులో భారీ షాట్లు ఆడేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాం. మొదటగా నేను, డికాక్.. ఆ తర్వాత కృనాల్‌-పొలార్డ్‌ల మధ్య మంచి భాగస్వామ్యం నమోదైంది. కృనాల్‌-పొలార్డ్‌లు నమోదు చేసిన భాగస్వామ్యమే మా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇటువంటి భారీ స్కోరు మ్యాచ్‌ల్లో ఛేజ్‌ చేసేటప్పడు పవర్‌ హిట్టర్లే సాధ్యమైనన్ని ఎక్కువ బంతులు ఆడాలి. అదే మేము చేశాం. కృనాల్‌ మంచి బ్యాటర్. అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి అవకాశం ఇవ్వాలనుకున్నాం' అని రోహిత్ పేర్కొన్నాడు.

బౌలర్లకు మద్దతు ఇవ్వాలి:

బౌలర్లకు మద్దతు ఇవ్వాలి:

'చెన్నై జట్టులో మంచి ఆఫ్-స్పిన్నర్స్ ఉన్నారు. అయినా కానీ మా ప్లేయర్స్ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేశారు. మా బ్యాటింగ్‌ స్టైల్‌కు ఢిల్లీ పిచ్‌ బాగా సెట్‌ అవుతుంది. ఇలాంటి మ్యాచుల్లో బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలోనే వారికి మద్దతు ఇవ్వాలి. ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచులో బౌలర్లు మమ్మల్ని తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చారు. బౌలర్లకు మద్దతు ఇవ్వడం వల్లే అలా జరుగుతుంది. మా బౌలర్లు మరిన్ని విజయాలు అందిస్తారని నాకు నమ్మకం ఉంది' అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచులో రోహిత్ 24 బంతుల్లో 35 రన్స్ చేశాడు.

ఒక సిక్స్‌ కూడా రాకపోయినట్లయితే:

ఒక సిక్స్‌ కూడా రాకపోయినట్లయితే:

'ఇది ఒక మంచి వికెట్‌. ఈ తరహా బ్యాటింగ్‌ వికెట్‌ కచ్చితంగా బౌలర్లకు సవాలే. కీలక సమయంలో క్యాచ్‌లు జారవిడిచాం. మా బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్‌ చేశారు. కానీ ఈ మ్యాచ్‌ ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈ వికెట్‌ హిట్‌ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లను దగ్గరగా వచ్చి ఓడిపోయాం. అలాగే కొన్ని క్లోజ్‌ గేమ్స్‌లో గెలిచాం. భారీ హిట్టర్లు ఉన్నప్పుడు తప్పిదాలు చేస్తే ఇలానే ఉంటుంది. పెద్ద టార్గెట్‌లు కూడా చిన్నవిగానే ఉంటాయి. ఆ సమయంలోనే ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయాలి. 20 ఓవర్‌లో కనీసం ఒక సిక్స్‌ కూడా రాకపోయినట్లయితే మ్యాచ్‌ను గెలిచేశాళ్లం. ఇది బాధిస్తోంది' అని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, May 2, 2021, 14:24 [IST]
Other articles published on May 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X