న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డు

Mayank Agarwal becomes fourth Indian batsman to convert maiden Test ton into a double century


హైదరాబాద్:
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 371 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్ 23 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 పరుగులు చేసి ఎల్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

సెంచరీ సాధించడానికి 204 బంతులు తీసుకున్న మయాంక్ అగర్వాల్ దానిని డబుల్‌ సెంచరీగా మలుచుకోవడానికి మరో 153 బంతులు మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో మొత్తంగా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మయాంక్ అగర్వాల్ టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్న 28 ఏళ్ల మయాంక్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ.

విశాఖ టెస్టులో పట్టు బిగించిన భారత్: టీమిండియా 502/7 డిక్లేర్డ్‌, దక్షిణాఫ్రికా 39/3విశాఖ టెస్టులో పట్టు బిగించిన భారత్: టీమిండియా 502/7 డిక్లేర్డ్‌, దక్షిణాఫ్రికా 39/3

దీని ఫలితంగా దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు 2008లో వీరేంద్ర సెహ్వాగ్ దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తంగా డబుల్ సెంచరీ సాధించిన 23వ భారత ఆటగాడిగా మయాంక్ రికార్డు సృష్టించాడు.

తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా

అంతేకాదు టెస్టుల్లో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతకముందు దిలిప్ సర్దేశాయి, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది.

300కుపైగా పరుగుల భాగస్వామ్యం

రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు.

తొలి ఓపెనింగ్ జోడీగా

దక్షిణాఫ్రికా జట్టుపై సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు నిలిచారు. అంతేకాదు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో 1996/97లో కోల్‌కతా వేదికగా జరిగిన టెస్టులో గ్యారీ కిరెస్టన్, ఆండ్రూ హుడ్సన్‌లు నెలకొల్పిన 236 పరుగుల రికార్డుని అధిగమించారు.

మూడొందలకు పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి

మూడొందలకు పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి

దక్షిణాఫ్రికా జట్టుపై 300 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మలు నిలిచారు. టెస్టు క్రికెట్‌లో భారత ఓపెనర్లు మూడొందలకు పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి. సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టులో సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మలు నిలిచారు.

రెండు సెంచరీలు చేయడం 10వసారి

రెండు సెంచరీలు చేయడం 10వసారి

టెస్టు క్రికెట్‌లో భారత ఓపెనర్లు తొలి ఇన్నింగ్స్‌లో ఇలా రెండు సెంచరీలు చేయడం ఇది 10వసారి. చివరగా 2018లో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు సెంచరీలు సాధించారు. భారత్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మూడో జోడిగా రోహిత్‌-మయాంక్‌లు నిలిచారు.

రోహిత్‌-మయాంక్‌లు మూడో జోడీగా

రోహిత్‌-మయాంక్‌లు మూడో జోడీగా

భారత్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌లు ఉన్నారు. 1955-56 సీజన్‌లో వీరిద్దరూ న్యూజిలాండ్‌పై 413 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఆ తర్వాత 2005-06 సీజన్‌లో పాకిస్తాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌-రాహుల్‌ ద్రవిడ్‌ల జోడీ 410 పరుగులు సాధించారు.

413- Vinoo Mankad and Pankaj Roy, 1955-56

410 - Sehwag-Dravid, 2006

317 - Rohit-Mayank, 2019

289 - Vijay-Dhawan, 2013

276 - C Dempster-J Mills, 1930

260 - B Mitchell-J Siedle, 1931

254 - Gayle-Powell, 2012

Story first published: Thursday, October 3, 2019, 19:02 [IST]
Other articles published on Oct 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X