మ్యాక్స్‌వెల్ మెరుపులు: ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడిన మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ నేతృత్వంలోని మెల్‌బోర్న్‌ స్టార్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో భాగంగా శుక్రవారం మార్వెల్ స్టేడియంలో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఫలితంగా ఇప్పటివరకూ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌ నిర్దేశించిన 169 పరుగుల విజయ లక్ష్యాన్ని మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది.

47వ పడిలోకి 'ది వాల్' రాహుల్ ద్రవిడ్: సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న బర్త్‌డే విషెస్

ఓపెనర్‌ స్టోయినిస్‌ డకౌట్‌‌గా వెనుదిరిగగా... మరో ఓపెనర్‌ హిల్టన్‌ కార్ట్‌రైట్‌(35) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌ డంక్‌(14) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నిక్‌ లార్కిన్‌కు జత కలిసిన కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ పరుగుల వరద పారించాడు.

రెనిగేడ్స్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 45 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్ల సాయంతో 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. 19 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు విజయాన్ని అందించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్‌ నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.

ధావన్ vs రాహుల్: ఒకరికి ఒకరిని శత్రువుల్లా చూపించే ధోరణిపై విరాట్ కోహ్లీ

ఓపెనర్లు షాన్‌ మార్ష్‌(63), మార్కస్‌ హారిస్‌(42)లు మంచి శుభారంభాన్ని అందించినా జట్టులోని మిగతా సభ్యులు విఫలం కావడంతో భారీ స్కోరు సాధించలేకపోయింది. తాజా, ఓటమితో ఈ టోర్నీలో మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, January 11, 2020, 13:19 [IST]
Other articles published on Jan 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X