న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇన్ని అవార్డులు గెలుచుకున్నా.. కనిపించలేదా.. వేలంలో ఎందుకు తీసుకోలేదు'

 Manoj Tiwary raises many questions after being snubbed at IPL 2019 auctions

న్యూఢిల్లీ: ఐపీఎల్ 12వ సీజన్‌కు సంబంధించి జైపూర్ వేదికగా వేలం నిర్వహించింది బీసీసీఐ. వేలం మొత్తంలో అనూహ్యంగా కుర్రాళ్లకే ఎక్కువ ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డిసెంబరు 18న మధ్యాహ్నం 3:30గంటలకు మొదలైన వేలం ఆరు గంటలపాటు జరిగింది. ఈసారి వేలం ప్రక్రియను హ్యూస్ ఎడ్ మెయిడాస్ నిర్వహించారు. 13దేశాలకు చెందిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ వేలంలోకి 351 మందిని ఉంచింది. ఇందులో ఎనిమిది ఫ్రాంచైజీలు 60 మంది స్వదేశ ఆటగాళ్లను 20 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

తివారీని కొనేందుకు ఆసక్తి కనబరచకపోవడం

తివారీని కొనేందుకు ఆసక్తి కనబరచకపోవడం

ఈ వేలం జరిగిన తీరుపై భారత క్రికెటర్‌ మనోజ్‌ తివారీ అసహనం వ్యక్తం చేశాడు. 2019 సీజన్‌ కోసం మంగళవారం జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ తివారీని కొనేందుకు ఆసక్తి కనబరచకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేశాడు. అతని కనీస ధర రూ.50 లక్షలకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు. దీంతో అతను ఈ సీజన్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. దీనిపై మనోజ్‌ తివారీ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

14 మ్యాచ్‌ల వరకు అవకాశం రాకపోవడంతో

‘నా జీవితంలో అసలేం జరుగుతుందో.. దేశం తరపున సెంచరీ చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న తరువాత కూడా 14 మ్యాచ్‌ల వరకు అవకాశం రాకపోవడం బాధకు గురి చేసింది. గెలిచిన అవార్డుల ఫొటోను ఉద్దేశిస్తూ.. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో ఇన్ని అవార్డులు గెలుచుకున్నాకూడా ఏం జరిగిందో అర్థం కావడం లేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

2017లో అద్భుతంగా రాణించిన తివారీ

2017లో అద్భుతంగా రాణించిన తివారీ

తివారీ గత సీజన్‌లో విఫలమైనప్పటికీ 2017లో రైజింగ్‌ పుణె సూపర్ జెయింట్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చి 15 మ్యాచ్‌ల్లో 324 పరుగులు చేశాడు. కానీ గత సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున 5 మ్యాచ్‌ల్లో 37 పరుగులే చేశాడు. కానీ, ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌పై బెంగాల్‌ తరుఫున డబుల్‌ సెంచరీ కూడా సాధించాడు. దీంతో ఐపీఎల్‌పై ఆశలు పెంచుకున్న తివారీ.. ఏ జట్టులోనూ చోటు దక్కపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

కొద్దిలో తప్పించుకున్న యువరాజ్

కొద్దిలో తప్పించుకున్న యువరాజ్

2011 సీజన్‌లో కోల్‌కతా టైటిల్‌ నెగ్గడంలో తివారీ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 359 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ముగిసేది. ఆఖరి క్షణాల్లో యువీని కనీస ధరకే కొనుగోలు చేయడంతో పరువు నిలబెట్టుకున్నాడు.

Story first published: Wednesday, December 19, 2018, 13:53 [IST]
Other articles published on Dec 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X